Share News

ప్రతి గింజకు లెక్క ఉండాల్సిందే

ABN , Publish Date - Nov 15 , 2026 | 06:08 AM

కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం రైస్‌ మిల్లులకు ఇచ్చిన ధాన్యం ప్రభుత్వ ఆస్తి అని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ వై.నాగిరెడ్డి పేర్కొన్నారు. కనుక ప్రతి గింజకూ లెక్క ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

ప్రతి గింజకు లెక్క ఉండాల్సిందే
Y Nagireddy

  • రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్‌ నాగిరెడ్డి హెచ్చరిక

హైదరాబాద్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం రైస్‌ మిల్లులకు ఇచ్చిన ధాన్యం ప్రభుత్వ ఆస్తి అని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ వై.నాగిరెడ్డి పేర్కొన్నారు. కనుక ప్రతి గింజకూ లెక్క ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్ర పౌర సరఫరాలతోపాటు ఇతర విభాగాల బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిబంధనలను పాటించే మిల్లర్లను ప్రోత్సహిస్తామన్నారు. వారికి సమస్యలుంటే పరిష్కరిస్తామని, కానీ, ఉద్దేశ పూర్వకంగా ధాన్యం పక్క దారి పట్టించినా, తప్పుడు లెక్కలు చూపడంతోపాటు పదే పదే తప్పులు చేసినా చట్ట ప్రకారం చర్యలు తప్పవని నాగిరెడ్డి హెచ్చరించారు.


రాష్ట్రవ్యాప్తంగా సాఫీగా ధాన్యం కొనుగోళ్లు జరగడమే తన తొలి ప్రాధాన్యం అని చెప్పారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణతోపాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించి.. నిల్వ చేయడంపై దృష్టి సారిస్తామన్నారు. ధాన్యం సేకరణలో సరైన తూకం పాటించడంతో పారదర్శకంగా రికార్డులు నిర్వహించి సకాలంలో అన్నదాతలకు డబ్బు చెల్లించాలన్నారు. పీడీఎ్‌సను మరింత బలోపేతం చేయాలన్న నాగిరెడ్డి.. నిత్యావసర సరుకులు పక్కదారి పట్టకుండా ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. పౌర సరఫరాల సంస్థలో ఆర్థిక క్రమశిక్షణతోపాటు పనితీరు మెరుగు పడాలని నొక్కి చెప్పారు.


ట్రాన్స్‌పోర్టర్లు, గోదాముల నిర్వాహకులు, రేషన్‌ డీలర్లు, ఇతర సిబ్బంది తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించాలని సూచించారు. నిత్యావసర సరుకుల బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజాయితీగా వ్యాపారం చేసుకునే వారికి మద్దతునిస్తామన్న నాగిరెడ్డి.. పెట్రోల్‌ బంకులు, ప్యాకింగ్‌ వస్తువుల్లో కచ్చితమైన కొలతలుండేలా చర్యలు తీసుకుంటామని నాగిరెడ్డి చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ధరణి అక్రమాలపై సీఐడీ దర్యాప్తు వేగవంతం

వికారాబాద్‌లో మహిళా క్రికెటర్‌ మృతి!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 06:08 AM