Share News

మూడేళ్లలో 6,630 కి.మీ.ల గ్రామీణ రహదారులు నిర్మించాం: సీతక్క

ABN , Publish Date - Nov 28 , 2026 | 05:44 AM

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో రాష్ట్రంలో 6,630కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు, అంతర్గత సీసీ రోడ్లు, వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే బాటలను నిర్మించామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు.

మూడేళ్లలో 6,630 కి.మీ.ల గ్రామీణ రహదారులు నిర్మించాం: సీతక్క

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో రాష్ట్రంలో 6,630కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు, అంతర్గత సీసీ రోడ్లు, వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే బాటలను నిర్మించామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ఈ రహదారుల నిర్మాణానికి 2,984.44కోట్ల నిధులను వెచ్చించామని తెలిపారు. వీబీ-జీ రామ్‌-జీ పథకం కింద చేపట్టిన పనుల సంఖ్యలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో, ఉపాధికల్పనలో మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.


నవంబరు 23న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 45,975 పనిప్రదేశాల్లో 5,52,643 మందికి ఉపాధి కల్పించినట్టు వెల్లడించారు. 2023 డిసెంబరు 7 నుంచి 2026 నవంబరు 26 వరకు ఉపాధి హామీ, వీబీ-జీ రామ్‌-జీ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం 12,487.97 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. రోజువారీ సగటు వేతనం రూ.188.25 నుంచి 277.13కు పెరిగిందన్నారు. జలసంచయ్‌ జన్‌భాగిదారీ (జేఎస్‌జేబీ) కార్యక్రమం అమలులో తెలంగాణ దేశంలోనే ప్రథమ ర్యాంకు సాధించిందని చెప్పారు.


ఈ వార్తలూ చదవండి

నిధులు ఉన్నా ఖర్చు చేయకపోతే ఎలా? అధికారులపై మంత్రి అడ్లూరి ఆగ్రహం

త్వరలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్య సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహా

Updated Date - Nov 28 , 2026 | 05:44 AM