Share News

మరో రెండ్రోజులు వర్షాలు

ABN , Publish Date - Sep 20 , 2026 | 05:29 AM

రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు అంటే ఆది, సోమవారాల్లో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం ఉదయం 8.30 నుంచి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశాలున్నాయి. 30-40 కి.మీ వేగంతో ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది.

మరో రెండ్రోజులు వర్షాలు
Telangana rain alert

  • కొన్ని జిల్లాల్లో భారీగా పడే అవకాశం

  • రాష్ట్రంలో పలుచోట్ల జోరుగా కురిసిన వర్షం

  • ఖమ్మం జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరి మృతి

  • పాలమూరు జిల్లా హన్వాడలో 9.4 సె.మీ.

  • హైదరాబాద్‌లో వాన.. జనం ఉపశమనం

హైదరాబాద్‌, సిటీ, కల్లూరు/వేంసూరు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు అంటే ఆది, సోమవారాల్లో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం ఉదయం 8.30 నుంచి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశాలున్నాయి. 30-40 కి.మీ వేగంతో ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది. నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, మెదక్‌, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడొచ్చునని పేర్కొంది ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. సోమవారం కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.


కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడ్డాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడలో అత్యధికంగా 9.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం కొన్నిచోట్ల భారీ వర్షం పడింది. హయత్‌నగర్‌లో 6.3, బాలాపూర్‌ ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టు 5.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లోహెచ్చరికలు జారీచేసింది. కాగా వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలుండటంతో సీఎస్‌ పరిస్థితిని సమీక్షించారు. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు, డ్రైనేజీ వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. కాగా ఖమ్మం జిల్లాలో శనివారం వేర్వేరు చోట్ల పిడుగుపాటు జమయమ్మ (50), ఆశీర్వాదం అలియాస్‌ ఆనందరావు (52) అనే రైతులు మృతిచెందారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మహిళను కొట్టి, జుట్టు పట్టి ఈడ్చి..
తమాషా చేస్తే.. టైర్ల కిందేసి తొక్కిస్తా!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 05:29 AM