Share News

అధిష్ఠానం పిలుపు.. ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు

ABN , Publish Date - Oct 25 , 2026 | 01:15 PM

తెలంగాణలోని బీజేపీ కీలక నేతలకు పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌లు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

అధిష్ఠానం పిలుపు.. ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు

హైదరాబాద్, అక్టోబర్ 25: తెలంగాణలోని బీజేపీ కీలక నేతలకు పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌లు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో వారు వేర్వేరుగా సమావేశం కానున్నట్లు తెలుస్తుంది.

రాష్ట్రంలో చేపట్టనున్న కార్యక్రమాలు.. లోక్ తంత్ర్ బచావో ... అరాచక్ హటావో కార్యక్రమం, పార్టీ సంస్థాగత మార్పులు, రాష్ట్ర రాజకీయ పరిణామాలతోపాటు స్థానికంగా పార్టీ మరింత బలోపేతం కావడం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ నేతలకు వారు దిశ నిర్దేశం చేయనున్నారని సమాచారం.


అదీకాక తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందుకోసం గ్రామ స్థాయిలో పార్టీని పటిష్ఠ పరిచేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక నవంబర్‌లో అమిత్ షా, డిసెంబర్‌లో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారని సమాచారం. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. అలాగే మిగిలిన ప్రాంతంలో కూడా పార్టీని మరింత బలోపేతం చేయడం ద్వారా అధికారం అందుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.


మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండో సారి అధికారం అందుకోవాలని ఆలోచనతో ముందుకు సాగుతోంది. ఇక పదేళ్లు పాలించి.. ప్రస్తుతం ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పూర్వ వైభవం కోసం తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. అలాంటి వేళ.. రాష్ట్రంలో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.

Updated Date - Oct 25 , 2026 | 01:45 PM