Share News

నాలుగైదు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

ABN , Publish Date - Oct 12 , 2026 | 05:18 AM

రాష్ట్రంలో త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థులను నాలుగైదు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు తెలిపారు.

నాలుగైదు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
Ramchander Rao

  • నేను పోటీ చేయటంపై అధిష్ఠానం నిర్ణయిస్తుంది

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థులను నాలుగైదు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు తెలిపారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయాలా వద్దా? అనేది జాతీయ నాయకత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌, నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీయే గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఈసారి టికెట్ల కోసం తీవ్ర పోటీ ఉందని, ఆశావహుల వివరాలను అధిష్ఠానానికి పంపినట్లు వెల్లడించారు.


ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్‌ తన రాజకీయ స్వార్థం కోసం వాడుకుందని, ఎన్నికల కమిషనర్లను రాజకీయ బానిసలుగా మార్చిన చరిత్ర ఆ పార్టీదని ధ్వజమెత్తారు. అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నా, భారత్‌ మాత్రం 7.8 శాతం వృద్ధిరేటుతో దూసుకుపోతోందని చెప్పారు. ప్రభుత్వ అధినేతగా (సీఎం, పీఎంగా) ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాంచందర్‌రావు అధ్యక్షతన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరిగింది. మోదీకి అభినందనలు తెలియజేస్తూ సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఐదేళ్ల బాలిక దారుణ హత్య

ఢిల్లీలో మీకు హక్కులు.. తెలంగాణలో మాకు నిర్బంధాలా?

Read Latest AP News And Telangana News 

Updated Date - Oct 12 , 2026 | 05:18 AM