Share News

ఐదేళ్ల బాలిక దారుణ హత్య

ABN , Publish Date - Oct 12 , 2026 | 05:08 AM

సెక్యూరిటీ గార్డు ఉద్యోగం నుంచి తొలగించారన్న కక్షతో ఓ యువకుడు ఐదేళ్ల చిన్నారిని పాశవికంగా హత్య చేశాడు. అందరూ బతుకమ్మ వేడుకల్లో ఉండగా ఆ గేటెడ్‌ కమ్యూనిటీలోకి ప్రవేశించిన ఆ దుర్మార్గుడు..

ఐదేళ్ల బాలిక దారుణ హత్య
Vikram

  • ఉద్యోగం నుంచి తొలగించారన్న కక్షతో మాజీ సెక్యూరిటీ గార్డు దారుణం

  • చిన్నారి చేతులు కాళ్లు కట్టేసి, నడుముకు రాయిని కట్టి సంపులో పడేసి హత్య

  • అర్ధరాత్రి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి రూ.20 లక్షలు డిమాండ్‌

  • నిందితుడు బిహార్‌ వాసి విక్రమ్‌గా గుర్తింపు

హైదరాబాద్‌ సిటీ/తిరుమలగిరి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): సెక్యూరిటీ గార్డు ఉద్యోగం నుంచి తొలగించారన్న కక్షతో ఓ యువకుడు ఐదేళ్ల చిన్నారిని పాశవికంగా హత్య చేశాడు. అందరూ బతుకమ్మ వేడుకల్లో ఉండగా ఆ గేటెడ్‌ కమ్యూనిటీలోకి ప్రవేశించిన ఆ దుర్మార్గుడు.. చిన్నారి కాళ్లు చేతులు కట్టేసి.. మెడకు ఉరి బిగించి.. నడుముకు రాయి కట్టి.. అదే ఆవరణలోని నీటి సంపులో పడేసి వెళ్లిపోయాడు. సాయంత్రం ఈ దారుణానికి ఒడిగట్టిన రాక్షసుడు.. అర్ధరాత్రి దాటాక ఫోన్‌ చేసి.. ఆ పాపను తానే కిడ్నాప్‌ చేశానని, విడిచిపెట్టాలంటే రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. చివరకు తెల్లవారుజామున చిన్నారి మృతదేహాన్ని సంపులో గుర్తించారు. హైదరాబాద్‌లోని బొల్లారంలో ఈ దారుణం చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. బిహార్‌ నుంచి బతుకుతెరువు కోసం వచ్చిన విక్రమ్‌ అనే యువకుడికి గేటెడ్‌ కమ్యూనిటీ అసోసియేషన్‌.. సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఇచ్చింది. అతను నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నందుకు అసోసియేషన్‌లోని అరుళ్‌దాస్‌ అనే పెద్దాయన మందలించారు. అయినా పద్ధతి మారకపోవడంతో అసోసియేషన్‌ సభ్యులు అతన్ని తొలగించారు. తన ఉద్యోగం పోవడానికి అరుళ్‌దాసే కారణమని కక్ష పెంచుకున్న విక్రమ్‌.. ఆయన మనుమరాలిని హత్య చేశాడు. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన అరుళ్‌దాస్‌ సింగరేణిలో పనిచేసి రిటైరయ్యారు. ఆయన కుమారుడు మిల్టన్‌ ఫెర్నాండెజ్‌, కోడలు డేజీ ఇవాంజిల్‌, వారి కుమారుడు జెడెన్‌ ఫెర్నాండెజ్‌, కుమార్తె అరేలియా మోసె్‌స(5)తో కలిసి కౌకూరులోని విల్లాస్‌ ఆర్కిడ్స్‌లో ప్లాట్‌ నం.84లో 2019 నుంచి ఉంటున్నారు.


మిల్టన్‌ ఫెర్నాండెజ్‌ పత్తి విత్తనాల కంపెనీలో సైంటి్‌స్టగా పనిచేస్తుండగా డేజీ ఇవాంజిల్‌ దేవరయాంజల్‌లోని ప్రముఖ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. జెడెన్‌ ఫెర్నాండెజ్‌, అరెలియా మోసెస్‌ అల్వాల్‌లోని సెయింట్‌ పాయిస్‌ పాఠశాలలో 7వ తరగతి, ఎల్‌కేజీ చదువుతున్నారు. దసరా సెలవులు కావడంతో జెడెన్‌ ఫెర్నాండెజ్‌ అరేలియా మోసె్‌సతో పాటు మరో నలుగురు చిన్నారులు విల్లా ఆర్కిడ్స్‌లోని క్లబ్‌ హౌస్‌ మెట్ల వద్ద సైకిల్‌ తొక్కుకుంటూ ఆడుకుంటున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విక్రమ్‌ నడుచుకుంటూ వచ్చి గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డులతో మాట్లాడాడు. తాను తిరిగి డ్యూటీలో చేరతానని, లోపలికి వెళ్లి అసోసియేషన్‌ సభ్యులతో మాట్లాడి బతిమిలాడి వస్తానని వెళ్లాడు.


ఆ సమయంలో అందరూ క్లబ్‌ హౌస్‌ వెనకాల బతుకమ్మ సంబురాల్లో బిజీగా ఉన్నారు. అరేలియాను అక్కడే అడుకోవాలని, తాను సైకిల్‌పై ఒక రౌండు వేసొస్తానని చెప్పి అన్నయ్య జెడెన్‌ వెళ్లాడు. సరిగ్గా అదే సమయానికి వచ్చిన విక్రమ్‌.. అరేలియాను కిడ్నాప్‌ చేశాడు. చాలా సమయం గడిచినా అరేలియా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెతకడం మొదలుపెట్టారు. వారి ఫిర్యాదుతో బొల్లారం పోలీసులు వచ్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ గుర్తుతెలియని నంబర్‌ నుంచి దుండగుడు అరుళ్‌దా్‌సకు ఫోన్‌ చేశాడు. హిందీలో మాట్లాడుతూ అరేలియాను కిడ్నాప్‌ చేశామని, అప్పగించాలంటే రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. సెక్యూరిటీ గార్డులను నిలదీయడంతో విక్రమ్‌ లోపలికి వచ్చాడని క్లబ్‌ హౌస్‌ సెల్లార్‌ నీటి సంపు వద్ద అరేలియా ఉందని చెప్పి ఆటోలో పరారయ్యాడని చెప్పారు. అక్కడికి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్న అలేరియా కనిపించింది. కాగా, నిందితుడు విక్రమ్‌ను మల్కాజిగిరి ఎస్‌వోటి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

సిద్దిపేట గడ్డ నుంచే మరో ఉద్యమం

పెళ్లైన విషయం దాచి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి

Read Latest AP News And Telangana News 

Updated Date - Oct 12 , 2026 | 05:08 AM