Share News

ఢిల్లీలో మీకు హక్కులు.. తెలంగాణలో మాకు నిర్బంధాలా?

ABN , Publish Date - Oct 12 , 2026 | 05:13 AM

రాజ్యాంగాన్ని కాపాడతామని పదేపదే చెబుతున్న కాంగ్రెస్‌ నేతల మాటలకు, చేతలకు పొంతన లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు.

ఢిల్లీలో మీకు హక్కులు.. తెలంగాణలో మాకు నిర్బంధాలా?
Kishan Reddy

  • కాంగ్రెస్‌ మాటలకు, చేతలకు పొంతనే లేదు

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం

హైదరాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగాన్ని కాపాడతామని పదేపదే చెబుతున్న కాంగ్రెస్‌ నేతల మాటలకు, చేతలకు పొంతన లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. ‘ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ చెబుతున్న మాటలకు, తెలంగాణలో వారి ప్రభుత్వం చేస్తున్న పనులకు ఏ మాత్రం పొంతన కనిపించడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ రెండు నాలుకల ధోరణికి తాజా పరిణామాలే ఉదాహరణ. 3, 4 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనల కారణంగా ప్రజలకు అసౌకర్యం కలిగినా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తినా.. అనేక సార్లు ఢిల్లీ పోలీసులు వారికి నిరసన తెలిపే అవకాశాన్ని కల్పించారు’ అని కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.


‘రాహుల్‌ గాంధీ దేశమంతా స్వేచ్ఛగా తిరుగుతూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీపై, కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు, అబద్ధాలతో విమర్శలు చేస్తున్నారు. ఈసీ, న్యాయవ్యవస్థ, భారత సైన్యంపైనా ఆరోపణలు చేస్తున్నారు. పచ్చి అబద్ధాలు చెబుతున్నా.. ఆయన వాక్‌స్వాతంత్ర్యాన్ని అడ్డుకోవాలని మా ప్రభుత్వం ఏనాడూ ప్రయత్నించలేదు. రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లోనూ కాంగ్రెస్‌ నాయకులు సీఈసీని తొలగించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించి, లోక్‌ భవన్‌ ముందు బైఠాయించారు. అప్పుడు శాంతిభద్రతలు అడ్డు రావా? బీజేపీ నాయకులు ప్రజా సమస్యలపై నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తే మాత్రం సమస్యలన్నీ గుర్తుకొస్తాయా? ఎక్కడికక్కడ మా నాయకులను నిర్బంధిస్తారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం?’ అని ఆయన నిలదీశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఐదేళ్ల బాలిక దారుణ హత్య

పెళ్లైన విషయం దాచి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి

Read Latest AP News And Telangana News 

Updated Date - Oct 12 , 2026 | 05:13 AM