తెలంగాణలో అనలాగ్ పనీర్‌పై నిషేధం..
ABN , Publish Date - Sep 11 , 2026 | 07:39 PM
తెలంగాణలో నాన్-డెయిరీ, ఆర్టిఫిషియల్, అనలాగ్ పనీర్ ఉత్పత్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీటి తయారీ, విక్రయాలతో పాటు నిల్వ, రవాణా, పంపిణీపై కూడా ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ నిషేధం సెప్టెంబర్ 10, 2026 నుంచి తక్షణమే అమల్లోకి వచ్చింది.
హైదరాబాద్: తెలంగాణలో నాన్-డెయిరీ, ఆర్టిఫిషియల్, అనలాగ్ పనీర్ ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిషేధం 2026 సెప్టెంబర్ 10 నుంచి తక్షణమే అమల్లోకి వచ్చింది. వీటి తయారీతో పాటు ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలను కూడా నిషేధించారు.
ఈ నిషేధం ఏడాది పాటు అమల్లో ఉంటుంది. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే Food Safety and Standards Act ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే చట్టబద్ధంగా, నిర్దేశించిన ఆహార ప్రమాణాలకు అనుగుణంగా తయారయ్యే స్టాండర్డైజ్డ్ ఫుడ్ ఉత్పత్తులకు ఈ నోటిఫికేషన్ వర్తించదని స్పష్టం చేశారు.
Also Read:
జీవో నంబర్ 97పై అసెంబ్లీ వేదికగా మంత్రి వివేక్ కీలక ప్రకటన..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు