Share News

అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల రాత పరీక్ష ఫలితాలు విడుదల

ABN , Publish Date - Oct 13 , 2026 | 06:29 AM

రాష్ట్ర ప్రాసిక్యూషన్‌ సర్వీ్‌సలోని అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సోమవారం విడుదల చేసింది.

అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల రాత పరీక్ష ఫలితాలు విడుదల
Telangana APP Results 2026

హైదరాబాద్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రాసిక్యూషన్‌ సర్వీ్‌సలోని అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు పూర్తి వివరాలను ఆ బోర్డు చైర్మన్‌ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ఈనెల 17న సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నామన్నారు.


అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్‌ ప్రతులతో అభ్యర్థులు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుందని తెలియజేశారు. ఏవైనా సమస్యలుంటే తమ రిజిస్టర్డ్‌ ఈమెయిల్‌ ఐడీ ద్వారా support@tslprb.inకు మెయిల్‌ చేయవచ్చని లేదా 040-41895151 హెల్ప్‌లైన్‌ నంబరును సంప్రదించవచ్చని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మరో స్వాతంత్య్ర పోరాటం

పప్పులు.. నూనెగింజలు.. కూరగాయలు

కోతకు ముందే కొనుగోలు!

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 13 , 2026 | 06:29 AM