Share News

స్టార్ట్‌పలే కాదు.. ప్రపంచస్థాయి సంస్థల నిర్మాణమే లక్ష్యం

ABN , Publish Date - Nov 21 , 2026 | 06:21 AM

తెలంగాణ కేవలం స్టార్ట్‌పలకు కేంద్రంగానే కాకుండా, ప్రపంచ మార్కెట్లలో పోటీపడగల అంతర్జాతీయ స్థాయి వ్యాపార సంస్థలకు చిరునామాగా ఎదగాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఆకాంక్షించారు.

స్టార్ట్‌పలే కాదు..  ప్రపంచస్థాయి సంస్థల నిర్మాణమే లక్ష్యం

  • అంతర్జాతీయ మార్కెట్లలో పోటీపడే కంపెనీలు రావాలి

  • సంస్థల అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పిస్తాం

  • హైదరాబాద్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కేవలం స్టార్ట్‌పలకు కేంద్రంగానే కాకుండా, ప్రపంచ మార్కెట్లలో పోటీపడగల అంతర్జాతీయ స్థాయి వ్యాపార సంస్థలకు చిరునామాగా ఎదగాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఆకాంక్షించారు. స్టార్ట్‌పల సంఖ్య పెరగడం కంటే, స్థిరమైన వ్యాపార నమూనాలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందే సంస్థలను నిర్మించడమే అసలైన విజయమని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో శుక్రవారం నిర్వహించిన హైదరాబాద్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ (హెచ్‌ఈఎస్‌) 2026లో మంత్రి వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. ఒక కంపెనీని ప్రారంభించడం సులభమే అయినా.. ప్రపంచవ్యాప్తంగా పోటీపడుతూ, దీర్ఘకాలం విజయవంతంగా కొనసాగించే సంస్థను నిర్మించడం సవాలుతో కూడుకున్నదన్నారు.


తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే కంపెనీలు రావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం నేరుగా కంపెనీలను సృష్టించలేదని, అవి అభివృద్ధి చెందేందుకు అవసరమైన అనుకూల వాతావరణాన్ని మాత్రమే కల్పించగలదని స్పష్టం చేశారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు మాట్లాడుతూ, హైదరాబాద్‌ అంతర్జాతీయ పెట్టుబడులకు అనువైన నగరంగా ఎదిగిందన్నారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, విద్యాసంస్థలు, సహకార పారిశ్రామిక వాతావరణం నగరానికి బలమని పేర్కొన్నారు. ఐటీ, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, తయారీ, రక్షణ, ఏరోస్పేస్‌, పరోశోధన రంగాల్లో హైదరాబాద్‌కు విస్తృత అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తొమ్మిది విభిన్న పారిశ్రామిక రంగాల్లో ప్రతిభ కనబరిచిన సంస్థలకు సంజయ్‌ జాజు టై డిస్టింక్టివ్‌ అవార్డులను ప్రదానం చేశారు.


ఇవి కూడా చదవండి...

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు

కాంగ్రెస్ మంత్రులకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రిక్వెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 06:21 AM