Share News

ఎంసీహెచ్‌లో తల్లీబిడ్డ మృతి

ABN , Publish Date - Oct 01 , 2026 | 06:32 AM

వికారాబాద్‌ జిల్లా తాండూరులోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రసవం కోసం వచ్చిన తల్లి, పుట్టిన బిడ్డ రెండు గంటల వ్యవధిలోనే మృతి చెందారు.

ఎంసీహెచ్‌లో తల్లీబిడ్డ మృతి
Tandur MCH

  • వైద్యుల నిర్లక్ష్యం వల్లేనన్న కుటుంబీకులు

తాండూరు, సెప్టెంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌ జిల్లా తాండూరులోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రసవం కోసం వచ్చిన తల్లి, పుట్టిన బిడ్డ రెండు గంటల వ్యవధిలోనే మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆరోపిస్తూ.. బాధితురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వడ్డె బాలమణి (25), రాజు దంపతులు గౌతాపూర్‌లో జీవనం సాగిస్తున్నారు.


బాలమణి మొదటి కాన్పు కోసం మంగళవారం రాత్రి తాండూరు మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చేరగా, బుధవారం ఉదయం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. బిడ్డకు జన్మనిచ్చిన రెండు గంటల అనంతరం బాలమణితో పాటు శిశువు మృతి చెందింది. సిజేరియన్‌ సమయంలోనే వైద్యుల నిర్లక్ష్యంతోనే తల్లీబిడ్డ మృతి చెందారని కుటుంబసభ్యులు వాపోయారు.


ఈ వార్తలు కూడా చదవండి:

క్షుద్ర పూజలంటూ అపవాదు వేశారు

బీఎల్‌వోలు ఓటర్ల ఇంటికే వెళ్లండి..!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 06:32 AM