Share News

‘తానా’ పురస్కారాల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Nov 19 , 2026 | 05:54 AM

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా ) ఆధ్వర్యంలో డిసెంబర్‌ 29న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ‘తానా పురస్కారాల ప్రదానోత్సవం’ ఘనంగా జరగనుంది.

‘తానా’ పురస్కారాల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా ) ఆధ్వర్యంలో డిసెంబర్‌ 29న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ‘తానా పురస్కారాల ప్రదానోత్సవం’ ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పది మంది ప్రముఖులను తానా ఈ వేదికపై సత్కరించనుంది.


అమరరాజా గ్రూప్‌ వ్యవస్థాపకుడు డా. రామచంద్ర నాయుడు గల్లా , సుద్దాల అశోక్‌ తేజ (తానా అందెశ్రీ పురస్కారం), జమీలా నిషాత్‌, డా. సునీతా కృష్ణన్‌, జయధీర్‌ తిరుమలరావు, గడ్డం సమ్మయ్య, చింతకింది మల్లేశం, చింతల వెంకట్‌ రెడ్డి, దాసరి కొండప్ప తదితరులకు తానా పురస్కారాలు అందజేస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తానా బోర్డ్‌ ఆఫ్‌ డైరక్టర్‌ రవి పొట్లూరి తెలిపారు. తానా అధ్యక్షుడు డాక్టర్‌ నరేన్‌ కొడాలి ఆధ్వర్యంలో జరగనున్న తానా 25వ మహాసభల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పురస్కారాల ప్రదానోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు హాజరవుతారని ఒక ప్రకటనలో తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ ఆదేశం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 05:54 AM