Share News

తెలంగాణ విద్యార్థులకు తైవాన్‌లో విద్య, ఉద్యోగావకాశాలు

ABN , Publish Date - Nov 29 , 2026 | 05:31 AM

తెలంగాణ విద్యార్థులు, యువతకు తైవాన్‌లో ఉన్నత విద్య, పరిశోధన, ఉద్యోగావకాశాలను పరిచయం చేసేందుకు టీ-వర్క్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల తైవాన్‌ ఉన్నత విద్యా ప్రదర్శన, ఉద్యోగ మేళా-2026 శనివారం ముగిసింది.

తెలంగాణ విద్యార్థులకు తైవాన్‌లో విద్య, ఉద్యోగావకాశాలు

  • ‘టీ-వర్క్స్‌’లో కుదిరిన ఒప్పందాలు

హైదరాబాద్‌, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): తెలంగాణ విద్యార్థులు, యువతకు తైవాన్‌లో ఉన్నత విద్య, పరిశోధన, ఉద్యోగావకాశాలను పరిచయం చేసేందుకు టీ-వర్క్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల తైవాన్‌ ఉన్నత విద్యా ప్రదర్శన, ఉద్యోగ మేళా-2026 శనివారం ముగిసింది. తెలంగాణ-తైవాన్‌ మధ్య విద్య, సంస్థాగత సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు రెండు అవగాహన ఒప్పందాలు కుదిరాయని నిర్వాహకులు తెలిపారు.


ఈ ప్రదర్శనలో విద్యార్థులు, పరిశోధకులు, ఇంజనీర్లు, యువ నిపుణులకు తైవాన్‌కు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలు, విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు.. వారి దేశంలో అమలవుతున్న ఉన్నత విద్య, ఉపకార వేతనాలు, పరిశోధన, ఉద్యోగావకాశాల గురించి వివరించారు. సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ , ఆధునిక తయారీ రంగాల్లో నైపుణ్యం కలిగిన యువతకు ఉన్న ఉద్యోగావకాశాల వివరాలను వెల్లడించారు. ఎన్విడియా, మీడియాటెక్‌, వైవిన్‌ కార్పొరేషన్‌, విట్స్‌ కార్ప్‌ వంటి ప్రముఖ సాంకేతిక సంస్థలు ఈ మేళాలో పాల్గొన్నాయి. రాష్ట్రాన్ని సాంకేతికత, ఆవిష్కరణలు, ఆధునిక తయారీ, అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సహకరిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు టీ-వర్క్స్‌ ఫౌండేషన్‌ కృతజ్ఞతలు తెలిపింది.


ఇవి కూడా చదవండి...

ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం

21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 29 , 2026 | 05:31 AM