ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు ఊరట
ABN , Publish Date - Mar 10 , 2026 | 03:34 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ప్రభాకర్‌రావుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది ఉన్నతన్యాయస్థానం.
న్యూఢిల్లీ, మార్చి 10: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టులో(Supreme Court) ఊరట లభించింది. ప్రభాకర్ రావుకు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ప్రభాకర్ రావుకు గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రెగ్యులర్ బెయిల్‌గా జస్టిస్ నాగరత్న ధర్మసనం మార్చింది. కేసు దర్యాప్తుకు సంపూర్ణంగా సహకరించాలని నిందితుడు ప్రభాకర్ రావుకు ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది.
అలాగే, పాస్‌పోర్టును ట్రయల్ కోర్టులో సరెండర్ చేయాలని.. సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రూ.35 వేల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తుల షూరిటీతో ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటి వరకు ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్‌లోనే కొనసాగుతున్నారు. మధ్యంతర బెయిల్‌లోనే ఆయనను పది రోజుల పాటు సిట్ విచారించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
వెలుగుమట్ల బాధితుల సమస్యపై కవిత ఆగ్రహం.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
రైతులపై కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలు.. బండి సంజయ్ హెచ్చరిక
Read Latest Telangana News And Telugu News