Share News

సృష్టి ఫెర్టిలిటీ డాక్టర్‌ నమ్రత ఆస్తుల అటాచ్‌పై తీర్పు రిజర్వు

ABN , Publish Date - Nov 28 , 2026 | 06:18 AM

సరోగసి ముసుగులో పిల్లల అక్రమ విక్రయానికి పాల్పడిన ఘటనకు సంబంధించిన సృష్టి ఫెర్టిలిటీ కేసులో డాక్టర్‌ నమ్రత ఆస్తుల అటాచ్‌ కోరుతూ సిట్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి.

సృష్టి ఫెర్టిలిటీ డాక్టర్‌ నమ్రత ఆస్తుల అటాచ్‌పై తీర్పు రిజర్వు

నాంపల్లి కోర్టులు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): సరోగసి ముసుగులో పిల్లల అక్రమ విక్రయానికి పాల్పడిన ఘటనకు సంబంధించిన సృష్టి ఫెర్టిలిటీ కేసులో డాక్టర్‌ నమ్రత ఆస్తుల అటాచ్‌ కోరుతూ సిట్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న నాంపల్లిలోని న్యాయస్థానం తీర్పును సోమవారానికి రిజర్వు చేసింది. డాక్టర్‌ నమ్రత బాధితుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారని, ఆ డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేశారని సిట్‌ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ న్యాయస్థానానికి వాదనలు వినిపించారు.


బాధితుల నుంచి తీసుకున్న డబ్బును వారికి తిరిగివ్వాలని కోరారు. పబ్లిక్‌ ప్రాసికూటర్‌ 107 బీఎన్‌ఎస్ఎస్ కింద దాఖలు చేసిన పిటిషన్‌లోని నిందితుల ఆస్తుల వివరాలపై నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్‌ జ్యుడీ షీయల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఆరా తీసింది. ఈడీ దాఖలు చేసిన కేసులో ఇటీవల జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన నిందితురాలు డాక్టర్‌ నమ్రత తరఫున ఆమె న్యాయవాది కూడా కోర్టుకు వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును సోమవారానికి రిజర్వు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి...

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్

Updated Date - Nov 28 , 2026 | 06:18 AM