Share News

మజ్లిస్‌ అదుపులోనే రహ్మత్‌ బేగ్‌!

ABN , Publish Date - Sep 01 , 2026 | 05:44 AM

నాయకుల కళ్లుగప్పి పరారైనట్లు ప్రచారం జరుగుతున్న మజ్లిస్‌ ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌.. ఆ పార్టీ అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది.

మజ్లిస్‌ అదుపులోనే రహ్మత్‌ బేగ్‌!
Rahmath Bage

  • ఎమ్మెల్సీ ఆచూకీ దొరకడం లేదంటూ ప్రచారం

  • రాజీనామా చేయించాక బయటికి తీసుకొచ్చే అవకాశం!

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్ర జ్యోతి): నాయకుల కళ్లుగప్పి పరారైనట్లు ప్రచారం జరుగుతున్న మజ్లిస్‌ ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌.. ఆ పార్టీ అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. వివాదం సద్దుమణిగే దాకా ఆయనను దాచిపెట్టి.. ఆ తరువాత బయటికి తీసుకొస్తారని, లేదంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా లేఖపై ఆయనతో సంతకం చేయించి శాసనమండలి చైర్మన్‌కు అందజేసే యోచనలో మజ్లిస్‌ నాయకత్వం ఉందనే ప్రచారం జరుగుతోంది. బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రహ్మత్‌ బేగ్‌ను అధిష్ఠానం ఇప్పటికే పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన అధికారాలను కూడా కత్తిరించింది. ఇప్పటివరకు రాజేంద్రనగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న బేగ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో బహదూర్‌పుర ఎమ్మెల్యే మహ్మద్‌ ముబీన్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. అయితే ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలన్న పార్టీ ఆదేశాలను మాత్రం రహ్మత్‌ బేగ్‌ ఖాతరు చేయడంలేదనే ప్రచారం జరుగుతోంది. ఆయనతో రాజీనామా చేయించడానికి పార్టీ వర్గాలు మూడు రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కానీ, తాను ఎలాంటి తప్పూ చేయలేదని, ఏఐ వీడియోతో తనను కుట్రపూరితంగా ఇరికించారని రహ్మత్‌ బేగ్‌ మూడు రోజుల కిందట ప్రకటించారు. కాగా, బేగ్‌ పదవీకాలం 2029లో ముగియనుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేటర్ల ఖాతాలో ఆయనను ఎమ్మెల్సీగా ఎంఐఎం ఎన్నుకుంది. అయితే ప్రస్తుతం జీహెచ్‌ఎంసీకి పాలకవర్గం లేదు. బేగ్‌ రాజీనామా చేసినా.. మళ్లీ గ్రేటర్‌ ఎన్నికలు జరిగిన తర్వాతే కార్పొరేటర్ల ఖాతాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది.


అమానుల్లాఖాన్‌ తర్వాత బహిష్కరణ ఇదే..

మజ్లి్‌సలో ఓ కీలక నేతపై చర్యలు తీసుకోవడం అమానుల్లాఖాన్‌ తరువాత మళ్లీ ఇన్నాళ్లకు జరిగింది. అమానుల్లాఖాన్‌ పార్టీ నాయకత్వ తీరును ప్రశ్నించిన మజ్లిస్‌ నుంచి సస్పెండ్‌ కాగా, రహ్మత్‌ బేగ్‌ మాత్రం అనైతిక కార్యకలాపాలతో బహిష్కరణకు గురయ్యారు. ఎమ్మెల్సీ రహ్మత్‌ బేగ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ మజ్లిస్‌ నాయకత్వం తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీకి చెందిన ఎమ్మెల్సీని గానీ, ఎమ్మెల్యేను గానీ బహిష్కరించాలంటే.. తొలుత పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగాల్సి ఉంటుందని, ఆ సమావేశ ంలో తీర్మానం చేసిన తర్వాత శాసనసభాపక్ష నేత లేఖతో బహిష్కరించాల్సి ఉంటుందని పలువురు గుర్తుచేస్తున్నారు. కేవలం వాట్సా్‌పలో పార్టీ సంయుక్త కార్యదర్శి ప్రకటనతో ఏ విధంగా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

పదేళ్ల దోపిడీ డబ్బును.. ఇప్పటికీ లెక్కపెడుతున్నారు

ప్రజల ఆశీస్సులకు అనుగుణంగా పాలన

Updated Date - Sep 01 , 2026 | 05:44 AM