‘సర్’కు వ్యతిరేకంగా 6న కలెక్టరేట్ల నిర్బంధం
ABN , Publish Date - Oct 04 , 2026 | 05:19 AM
సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలతో కలిసి ఈనెల 6న కలెక్టరేటర్లను నిర్బంధిస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు.
హైదరాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలతో కలిసి ఈనెల 6న కలెక్టరేటర్లను నిర్బంధిస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించడంతో పాటు ఆయన్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం గాంధీ భవన్‌లో మహేశ్ గౌడ్ అధ్యక్షతన ఇండియా కూటమి పార్టీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. సీఈసీ తీరును ఇండియా కూటమి తీవ్రంగా నిరసిస్తోందన్నారు. అర్హత కలిగిన లక్షలాది మంది పౌరుల ఓట్లను ఈసీ తొలగిస్తోందని.. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యహరిస్తోందని దుయ్యబట్టారు. 6న జిల్లా కేంద్రాల్లో ఇండియా కూటమి పార్టీలతో కలిసి ర్యాలీలు నిర్వహిస్తామని, అనంతరం కలెక్టరేట్లను నిర్బంధిస్తామని తెలిపారు. 8న కూటమి పార్టీలన్నీ కలిసి లోక్‌భవన్‌ను ముట్టడిస్తాయని, నవంబరు 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
22ఏ నుంచి తొలగింపు.. నాలా కింద ప్లాట్లు, ఇళ్ల రిజిస్ట్రేషన్లకు ఊరట
గౌరవెల్లి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించాలి.. 98 శాతం పనులు పూర్తి: మంత్రి ఉత్తమ్
ఎస్‌ఐఆర్‌పై ప్రకాశ్‌రాజ్ తీవ్ర ఆరోపణలు.. మోదీ, షానే సూత్రధారులు