Share News

మిగులు బొగ్గు ఇస్తాం... తీసుకోండి

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:49 AM

ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌ నుంచి తెలంగాణకు సరఫరా చేయగా మిగిలిన బొగ్గును స్థానిక పరిశ్రమలతో పాటు ఆ రాష్ట్రంలో ఉన్న ఎన్టీపీసీ కనిహా థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌కు సరఫరా చేయడానికి సింగరేణి సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది.

మిగులు బొగ్గు ఇస్తాం... తీసుకోండి

  • ఒడిశాలోని ఎన్టీపీసీకి నైనీ బొగ్గు ఆఫర్‌

  • ఎన్టీపీసీ సీఎండీకి తెలిపిన సింగరేణి సీఎండీ

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌ నుంచి తెలంగాణకు సరఫరా చేయగా మిగిలిన బొగ్గును స్థానిక పరిశ్రమలతో పాటు ఆ రాష్ట్రంలో ఉన్న ఎన్టీపీసీ కనిహా థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌కు సరఫరా చేయడానికి సింగరేణి సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్‌ సింగ్‌తో సింగరేణి సీఎండీ డాక్టర్‌ బుద్ధప్రకాశ్‌ జ్యోతి న్యూఢిల్లీలో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నైనీ బొగ్గు బ్లాక్‌లో జరుగుతున్న ఉత్పత్తి గురించి గురుదీప్‌ సింగ్‌కు బుద్ధ ప్రకాష్‌ జ్యోతి వివరించారు.


రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు తెలంగాణకు తొలి ప్రాధాన్యతనిస్తూ.. యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి నైనీ బొగ్గులో అధిక భాగం సరఫరా చేస్తున్నామని తెలిపారు. మిగిలిన బొగ్గును స్థానిక పరిశ్రమలకు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. ఎన్టీపీసీతో ఇప్పటికే తమకున్న బొగ్గు సరఫరా ఒప్పందాలకు అనుబంధంగా.. ఒడిశాలోని కనిహా థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ కూడా బొగ్గును దీర్ఘకాలిక ఒప్పందంతో అందించడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. దీనిపై గురుదీప్‌ సింగ్‌ సానుకూలంగా స్పందించారు. నైనీ బొగ్గు బ్లాకు తమ ప్లాంట్‌కు సమీపంలోనే ఉన్నందున అక్కడి నుంచి కూడా బొగ్గు తీసుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..

Updated Date - Nov 21 , 2026 | 05:49 AM