రెండో రోజు సిట్ కస్టడీకి మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు నిందితులు
ABN , Publish Date - Mar 25 , 2026 | 10:20 AM
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ, కాల్పుల కేసుకు సంబంధించి నిందితులను ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) అధికారులు రెండో రోజు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారికి పోలీసులు పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉందని తెలుస్తోంది.
హైదరాబాద్, మార్చి 25: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ, కాల్పుల కేసుకు సంబంధించి నిందితులను ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) అధికారులు రెండో రోజు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారికి పోలీసులు పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండో రోజు విచారణలో భాగంగా మొయినాబాద్ ఫామ్ హౌస్‌లోనే వీరిని విచారించనున్నట్లు సమాచారం. మొదటి రోజు మంగళవారం కస్టడీలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఈ కేసులో నిందితులు రోహిత్ రెడ్డి, రితేష్, నమిత్ శర్మలను సిట్ విచారించింది.
ఈ విచారణ సందర్భంగా నిందితులపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించిందని తెలుస్తోంది. తొలుత ఈ ముగ్గురిని వేర్వేరుగా ఉంచి సిట్ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ పెడ్లర్లతో తనకెలాంటి సంబంధం లేదని సిట్ అధికారులతో రోహిత్ రెడ్డి వాదించారు. ఈ నేపథ్యంలో గతంలో డ్రగ్స్ పెడ్లర్లతో వాట్సాప్ కాల్స్, నగదు బదిలీలకు సంబంధించిన లావాదేవీలను వారు చూపించడంతో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మౌనం వహించారు.
ఆ తర్వాత ముగ్గురిని ఒకే చోట ఉంచి సిట్ అధికారులు విచారించారు. మద్యం మత్తులోనే తాను కాల్పులు జరిపానని ఈ సందర్భంగా వారికి నమిత్ శర్మ తెలిపారు. పోలీసుల వైపు గన్ ఫైర్ చేయాలని తాము నమిత్ శర్మకు ఆదేశాలు ఇవ్వలేదని రోహిత్ రెడ్డితోపాటు అతడి సోదరుడు రితీష్ వెల్లడించారు. మత్తులోనే విచక్షణ కోల్పోయి నమిత్ శర్మ గన్ ఫైర్ చేశాడని రోహిత్ రెడ్డి సోదరులు సిట్ అధికారులకు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
యుద్ధం ఎఫెక్ట్.. మూతబడుతున్న పెట్రోల్ బంక్‌లు
For More TG News And Telugu News