Share News

బదిలీపై వెళ్తున్న జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ భేటీ..

ABN , Publish Date - Mar 08 , 2026 | 07:15 PM

మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీపై వెళ్తున్న జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు.

బదిలీపై వెళ్తున్న జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ భేటీ..

హైదరాబాద్, మార్చి 08: మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీపై వెళ్తున్న జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. త్రిపురకు చెందిన జిష్ణుదేవ్ వర్మ.. 2024, జులై 27న తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే తాజాగా పలు రాష్ట్రాల గవర్నర్లను కేంద్రం బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ అయ్యారు. ఇక జిష్ణుదేవ్ వర్మతో జరిగిన భేటీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు.


మరోవైపు బదిలీపై వెళ్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఇక తెలంగాణ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఆయన రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.


ఇక పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్.. తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని కేంద్రం నియమించింది. అయితే ఆకస్మాత్తుగా గవర్నర్ పదవికి రాజీనామా చేయడంపై ఆనంద్ బోస్ వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. అదీకాక.. కేరళకు చెందిన ఆనంద్ బోస్.. తన ఓటును స్వరాష్ట్రం నుంచి పశ్చిమబెంగాల్ మార్చుకోవడం గమనార్హం. మరికొద్ది నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. గవర్నర్ పదవికి ఆనంద్ బోస్ రాజీనామా హాట్ టాపిక్‌గా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి..

భగవద్గీతలో మాట తప్పని మడము తిప్పని అని మాటలేంటి?: స్వామి శ్రీనివాసానంద సరస్వతి

ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో మహిళా సంక్షేమానికి పెద్ద పీట: సీతక్క

For More TG News And Telugu News

Updated Date - Mar 08 , 2026 | 07:21 PM