ఇందిర స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వ పాలన
ABN , Publish Date - Nov 19 , 2026 | 04:40 AM
భారతదేశ సమగ్రత, సమైక్యత కోసం కృషి చేసిన గొప్ప నాయకురాలు, దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేసిన ధైర్యశాలి ఇందిరాగాంధీ అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు.
దేశం కోసం ప్రాణాలను లెక్క చేయని ధైర్యశాలి: సీఎం రేవంత్
హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): భారతదేశ సమగ్రత, సమైక్యత కోసం కృషి చేసిన గొప్ప నాయకురాలు, దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేసిన ధైర్యశాలి ఇందిరాగాంధీ అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఆమె చూపిన మార్గం, అమలు చేసిన సంక్షేమ విధానాలు నేటికీ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. పేదల ఆత్మ బంధువుగా పేరొందిన ఇందిరాగాంధీ ఆశయాలు, సంక్షేమ విధానాల స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని స్పష్టం చేశారు.
ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా దేశానికి ఆమె చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. దేశం ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్న గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని పేర్కొన్నారు. బ్యాంకుల జాతీయీకరణ, రాజాభరణాల రద్దు, 20 సూత్రాల కార్యక్రమం వంటి కీలక నిర్ణయాలతో దేశ ఆర్థిక, సామాజిక రంగాల్లో ఇందిరాగాంధీ అనేక మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి
ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ ఆదేశం
Read Latest Telangana News And Telugu News