ఐఆర్సీలో రామప్ప దేవాలయం నమూనా
ABN , Publish Date - Nov 19 , 2026 | 05:21 AM
ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) 85వ సదస్సుకు సర్వం సిద్ధమైంది.
టెక్నికల్ ఎక్స్పోను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) 85వ సదస్సుకు సర్వం సిద్ధమైంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం ఉదయం 11.30 గంటలకు సదస్సును ప్రారంభించనున్నారు. సదస్సు సందర్భంగా హైటెక్స్ ప్రాంగణంలో రహదారుల నిర్మాణంలో ఆధునిక సాంకేతికతలను తెలిపే టెక్నికల్ ఎక్స్పోను ఏర్పాటు చేశారు. అందులో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం నమూనాను ఉంచారు. ఇది చూపరులను ఆకట్టుకుంటోంది.
ఈ ఎక్స్పోను బుధవారం మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. ఐఆర్సీని ఉమ్మడి ఏపీలో 4సార్లు, తెలంగాణ ఏర్పాటయ్యాక 2016లోఒకసారి, ఇప్పుడు రెండోసారి నిర్వహించుకుంటున్నామని చెప్పారు. స్వాతంత్ర్యానికి పూర్వమే 1938లో దక్కన్ సంస్థానం కాలంలో ఐఆర్సీ 4వ సమావేశం మొదటిసారిగా హైదరాబాద్లో జరిగిందన్నారు. ఐఆర్సీ ప్రెసిడెంట్ ఎల్కే పాండీ, ఐఆర్సీ సెక్రటరీ జనరల్ రాహుల్ గుప్తా, ఐఆర్సీ అడ్మిన్ డైరెక్టర్ సురేందర్, మోర్త్ తెలంగాణ ఆర్వో ఏ కృష్ణప్రసాద్, ఆర్ అండ్ బీ సీఈలు బీవీ రావు, లింగారెడ్డి, వసంతనాయక్, ధర్మారెడ్డి, రాజేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం
బాబా బర్త్డే స్పెషల్.. బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలు
Read Latest Telangana News And Telugu News