Share News

రాహుల్‌ సవాల్‌ను మోదీ స్వీకరించాల్సిందే..

ABN , Publish Date - Nov 14 , 2026 | 05:59 AM

ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సవాల్‌ను ప్రధాని మోదీ స్వీకరించాల్సిందేనని టీపీసీసీ చీఫ్‌ మహే్‌షగౌడ్‌ అన్నారు.

రాహుల్‌ సవాల్‌ను మోదీ స్వీకరించాల్సిందే..
Mahesh Kumar Goud

  • ఫోన్‌ ట్యాపింగ్‌ని తీవ్ర నేరంగా పరిగణించాలి : మహే‌ష్‌గౌడ్‌

హైదరాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సవాల్‌ను ప్రధాని మోదీ స్వీకరించాల్సిందేనని టీపీసీసీ చీఫ్‌ మహే్‌షగౌడ్‌ అన్నారు. రాహుల్‌ ఫోన్‌ ట్యాప్‌ కావడం అన్నది నూటికి నూరుపాళ్లు వాస్తవమని పేర్కొన్నారు. ఈ విషయంలో గతం నుంచి తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు.


రాహుల్‌ గాంధీ పార్లమెంటులో ఏం మాట్లాడబోతున్నారనే సమాచారాన్ని ఫోన్‌ ట్యాప్‌ ద్వారా మోదీ తెలుసుకుని, సభలో మైక్‌ ఇచ్చేవారు కాదని వివరించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అన్నది అప్రజాస్వామికం... బాధాకరమని, దీన్ని తీవ్ర నేరంగా పరిగణించాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పదేళ్లు అవలంబించిన నీచపు తీరునే కేంద్రంలో మోదీ, అమిత్‌ షాలు అనుసరిస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో బీఆర్‌ఎ్‌సకు పట్టిన గతే బీజేపీకీ పడుతుందని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


ఇవి కూాడా చదవండి..

విచిత్రం: ఓవర్ స్పీడ్‌కు చలానా.. లొకేషన్ మాత్రం అట్లాంటిక్ మహాసముద్రం!

అస్సాంలో ఘోర ప్రమాదం.. మినీబస్సు, కంటైనర్ ట్రక్కు ఢీకొని పలువురి మృతి

Updated Date - Nov 14 , 2026 | 05:59 AM