Share News

మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకోవడం సిగ్గుచేటు: ఎంపీ రఘునందన్ రావు

ABN , Publish Date - Apr 26 , 2026 | 04:45 PM

మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకోవడం సిగ్గుచేటు అని ఎంపీ రఘునందన్ రావు ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. అవగాహన లేకపోవడం వల్లే మహిళలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు.

మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకోవడం సిగ్గుచేటు: ఎంపీ రఘునందన్ రావు
Raghunandan Rao Comments

ఆదిలాబాద్: మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్ బిల్లులను అడ్డుకున్నామని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. అవగాహన లేకపోవడం వల్లే మహిళలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. ఈ విషయానికి సంబంధించి రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు అయ్యేలా బీజేపీ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.


ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన హామీలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేస్తారని రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీజేపీ వెనుకడుగు వేయదని అన్నారు. అలాగే, ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై రేపు జరగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ అధినేత కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంశంపై సీబీఐకి రాసిన లేఖను సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు వెల్లడించాలని ఆయన కోరారు.


Also Read:

మాదక ద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి.. కవితకు లేదు: మల్లు రవి

For More Latest News

Updated Date - Apr 26 , 2026 | 04:55 PM