ప్రశ్నించడం నేర్పాలి: ప్రొఫెసర్ రామచంద్రయ్య
ABN , Publish Date - Oct 12 , 2026 | 06:20 AM
శాస్త్రీయంగా ఆలోచించడంతోపాటు విద్యార్థులకు ప్రశ్నించడం నేర్పాలని ప్రొఫెసర్ రామచంద్రయ్య పేర్కొన్నారు. భారతీయ పాఠశాల ఉపాధ్యాయుల సమాఖ్య (ఎస్టీఎఫ్ఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో..
హైదరాబాద్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): శాస్త్రీయంగా ఆలోచించడంతోపాటు విద్యార్థులకు ప్రశ్నించడం నేర్పాలని ప్రొఫెసర్ రామచంద్రయ్య పేర్కొన్నారు. భారతీయ పాఠశాల ఉపాధ్యాయుల సమాఖ్య (ఎస్టీఎఫ్ఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం రెండో రోజు దక్షిణాది ప్రాంతీయ శిక్షణా తరగతుల్లో ‘శాస్త్రీయ ఆలోచన - ఉపాధ్యాయుల పాత్ర అనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నిస్తే హేతుబద్ధమైన ఆలోచనకు దారి తీస్తుందని, దాని నుంచే శాస్త్రీయ అవగాహన అభివృద్థి చెందుతుందన్నారు. ‘భారతీయ విద్య -ఎన్‌ఈపీ 2020 అమలుతో పరిణామాలు’అంశంపై రాధాకృష్ణన్ మాట్లాడుతూ విద్య కేంద్రీకరణ పేరుతో ఎన్టీఏ నిర్వహిస్తున్న ‘నీట్’ పరీక్షలో అవకతవకలను ప్రస్తావించారు. ఈ విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సిరిసిల్ల ఇంజనీరింగ్ కాలేజీ సమస్యలు పరిష్కరించండి: కేటీఆర్
డ్రగ్స్ పెడ్లర్ల ఆర్థిక మూలాలపై ఈగల్ నజర్
మంత్రి దామోదర కంటికి శస్త్రచికిత్స
Read Latest AP News And Telangana News