ఆ ఏరియాల్లో 10 గంటల నుంచి విద్యుత్ సరఫరా బంద్
ABN , Publish Date - Jan 27 , 2026 | 06:51 AM
హైదరాబాద్ మహానగరంలోని ఆయా ఏరియాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతులు, ఇతర కారణాలతో సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
- నగరంలో.. నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హైదరాబాద్: బంజారాహిల్స్ ఏడీఈ(Banjara Hills ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ జింఖాన క్లబ్, ఓబుల్ రెడ్డి స్కూల్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ ఎల్వీ ప్రసాద్ మార్గ్, రోడ్డు నెంబర్.5 ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.

గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలో..
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ(Greenlands ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్.వి.సత్యనారాయణ(ADE L.V. Satyanarayana) తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ జనప్రియ, డీఎన్‌ఎం కాలనీ ఫీడర్ల పరిధి, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 11కేవీ మెథడిస్ట్ కాలనీ ఫీడర్ పరిధి, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ ఈఎ్‌సఐ మున్సిపల్ పార్కు, బేగంపేట బ్రాహ్మణవాడి, ట్రాసిస్ట్ హాస్టల్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి.
హింసను ప్రశ్నించినా బెదిరింపులే!
Read Latest Telangana News and National News