Share News

25 నుంచి హైటెక్స్‌లో పౌల్ర్టీ ఇండియా ఎక్స్‌పో

ABN , Publish Date - Nov 23 , 2026 | 04:33 AM

పౌల్ర్టీ ప్రదర్శనల్లో భాగంగా 18వ పౌల్ర్టీ ఇండియా ఎక్స్‌పో-2026ను ఈ నెల 25 నుంచి 27 వరకు హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో నిర్వహించనున్నారు.

25 నుంచి హైటెక్స్‌లో పౌల్ర్టీ ఇండియా ఎక్స్‌పో
Poultry India Expo 2026

  • సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : పౌల్ర్టీ ప్రదర్శనల్లో భాగంగా 18వ పౌల్ర్టీ ఇండియా ఎక్స్‌పో-2026ను ఈ నెల 25 నుంచి 27 వరకు హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో నిర్వహించనున్నారు. ఈ ఎక్స్‌పోలో 125 దేశాల నుంచి 51 వేల మందికి పైగా పౌల్ర్టీ రంగ నిపుణులు, వ్యాపారవేత్తలు పాల్గొంటారని, 550కి పైగా సంస్థలు తమ ఉత్పత్తులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


ఇండియన్‌ పౌల్ర్టీ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌(ఐపీఈఎంఏ) ఆధ్వర్యంలో హెచ్‌ఐసీసీ - నోవాటెల్‌లో పౌల్ర్టీ నాలెడ్జ్‌ డే-2026 నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, పంచాయతీరాజ్‌ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్‌ ఎస్‌.పి. సింగ్‌ బఘేల్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.


ఈ వార్తలూ చదవండి

పార్టీకి నష్టపరిచేలా మాట్లాడితే చర్యలు.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

పది లక్షల పుస్తకాల సేకరణే లక్ష్యం!

Updated Date - Nov 23 , 2026 | 04:33 AM