Share News

బీజేపీ నేతలు ఏనాడైనా ఓం నమఃశివాయ అన్నారా..?: పొన్నం

ABN , Publish Date - Sep 30 , 2026 | 04:53 AM

‘మా ముఖ్యమంత్రి చెప్పినట్లుగా శివుడు పేదల దేవుడే.. బీజేపీ నేతలు ఏనాడైనా ఓం నమఃశివాయ అని అన్నారా..?’ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశించారు.

బీజేపీ నేతలు ఏనాడైనా ఓం నమఃశివాయ అన్నారా..?: పొన్నం
Ponnam Prabhakar

  • దేవుడి పేరుతో రాజకీయాలు చేసేది బీజేపీయే: మధుయాష్కీ

వేములవాడ/న్యూఢిల్లీ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘మా ముఖ్యమంత్రి చెప్పినట్లుగా శివుడు పేదల దేవుడే.. బీజేపీ నేతలు ఏనాడైనా ఓం నమఃశివాయ అని అన్నారా..?’ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర స్వామిని ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, సీహెచ్‌. విజయరమణారావు, వేముల వీరేశంలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్‌ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం ఎవరికీ మంచిది కాదన్నారు.


తాము ఏ దేవుళ్లకూ వ్యతిరేకం కాదని, తాము ద్రావిడులమని, దక్షిణాదికి సంబంధించిన వాళ్లందరికీ ఆరాధ్య దైవం శివుడేనని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటలపై బండి సంజయ్‌ స్పందించారని, బీజేపీ వాళ్లు ఎక్కడికి వెళ్లినా జై శ్రీరాం అని అంటారు తప్పులేదని, ఎవరి మత విశ్వాసాలు వారివని అన్నారు. ‘జై శ్రీరామ్‌’ అంటూ, దేవునిపేరును అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తోంది బీజేపీ నేతలేనని మధుయాష్కీ గౌడ్‌ అన్నారు. దమ్ముంటే బండి సంజయ్‌ చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధికి వచ్చి, రామమందిరం పేరుతో ఓట్లు అడగలేదని ప్రమాణం చేయాలని సవాల్‌ విసిరారు.


ఇవి కూడా చదవండి...

హిందూ దేవుళ్లను విభజిస్తారా?

నిమ్స్‌ లక్ష్మీ భాస్కర్‌ కేసులో మరో 3.5 కోట్ల ఆస్తులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 04:53 AM