గురుకులాలు, హాస్టళ్లలో క్లీన్ అండ్ గ్రీన్‌కు ప్రాధాన్యం: మంత్రి పొన్నం
ABN , Publish Date - Jul 07 , 2026 | 08:32 PM
గురుకులాలు, హాస్టళ్లలో క్లీన్ అండ్ గ్రీన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఉన్నతాధికారులకు రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మంగళవారం ఆయా శాఖల ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్, జులై 07: గురుకులాలు, హాస్టళ్లలో క్లీన్ అండ్ గ్రీన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఉన్నతాధికారులకు రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మంగళవారం ఆయా శాఖల ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మెనూ తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమంపై డీబీసీవోలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బీసీ స్టడీ సర్కిల్స్ బలోపేతానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇతర రాష్ట్రాల స్టడీ సర్కిల్స్ విధానాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. జూలై 16 నుంచి కులవృత్తుల మేళా.. అన్ని కులాలకు సమాన అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్‌తో బీసీలకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్‌పై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను కోరారు.
ఐఐటీ, ఐఐఎం విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీపై ఈ సందర్భంగా అధికారుల నుంచి మంత్రి నివేదిక కోరారు. గురుకులాలు, హాస్టళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. కుట్టు మిషన్ పథకం అమలుకు సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు. కాటమయ్య రక్షణ కవచాల కిట్ల పంపిణీ వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం
రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్
For More TG News And Telugu News