వికారాబాద్ జిల్లాలో కీచక టీచర్‌పై పోక్సో కేసు
ABN , Publish Date - Sep 24 , 2026 | 08:29 AM
ఆనాథ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడుతున్న కీచక టీచర్‌పై పోక్సో కేసు నమోదైంది.
అనాథ బాలికల పట్ల అసభ్య ప్రవర్తన
పరిగి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఆనాథ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడుతున్న కీచక టీచర్‌పై పోక్సో కేసు నమోదైంది. ప్రస్తుతం నిందితుడిని పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. రంగారెడ్డి పరిగి మున్సిపల్ పరిధిలోని ఓ పాఠశాలలో శ్రీశైలం అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.
అదే పాఠశాలలో రెండు నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న చిన్నారులు, సదరు టీచర్ వికృత చేష్టలకు భయాందోళనకు గురై ఆశ్రమం సంరక్షకురాలికి విషయం తెలపగా, ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మోహనకృష్ణ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సౌదీ తెలుగు ప్రవాసీయులు.. గల్ఫ్ భారతీయులందరికీ ఆదర్శం
ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తా!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News