క్యాబ్ ఎక్కుతున్న యువతితో అసభ్యప్రవర్తన !
ABN , Publish Date - Sep 24 , 2026 | 08:24 AM
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ ప్రాంతంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన ఓ యువతి ప్రైవేట్ క్యాబ్ ఎక్కుతుండగా..
ఆమెను పక్కకు లాగి ముద్దు పెట్టుకున్న సెక్యూరిటీగార్డు
గచ్చిబౌలిలో ఘటన, నిందితుడి అరెస్టు
రాయదుర్గం, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ ప్రాంతంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన ఓ యువతి ప్రైవేట్ క్యాబ్ ఎక్కుతుండగా.. ఓ సెక్యూరిటీ గార్డు ఆమెను పక్కకు లాగి ముద్దు పెట్టుకున్నాడు. దీంతో ఆ యువతి పెద్దగా అరవగా ఆ సెక్యూరిటీ గార్డు అక్కడి నుంచి పారిపోయాడు. గచ్చిబౌలి ఇందిరానగర్‌లో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
ఈ మేరకు బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఝార్ఖండ్‌కు చెందిన రాజ్‌కుమార్ అనే సెక్యూరిటీ గార్డును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సౌదీ తెలుగు ప్రవాసీయులు.. గల్ఫ్ భారతీయులందరికీ ఆదర్శం
ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తా!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News