ప్రభుత్వ వైద్య కాలేజీలు బోధనాస్పత్రుల్లోనూ ‘పీఎం రాహత్’
ABN , Publish Date - Nov 19 , 2026 | 05:49 AM
రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర చికిత్స కోసం తీసుకువచ్చిన ‘పీఎం రాహత్ (ప్రధానమంత్రి రోడ్డు ప్రమాద బాధితుల ఆస్పత్రి చేర్పింపు, హామీతో కూడిన చికిత్స పథకం)’ను మరింత విస్తరించేందుకు కేంద్రం సిద్ధమైంది.
రోడ్డు ప్రమాద బాధితులకు మరింత భరోసా
రూ.1.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం
ప్రమాదం నుంచి 7 రోజులపాటు వర్తింపు
ఆస్పత్రుల అనుసంధానానికి ఎన్‌ఎంసీ ఆదేశాలు
హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర చికిత్స కోసం తీసుకువచ్చిన ‘పీఎం రాహత్ (ప్రధానమంత్రి రోడ్డు ప్రమాద బాధితుల ఆస్పత్రి చేర్పింపు, హామీతో కూడిన చికిత్స పథకం)’ను మరింత విస్తరించేందుకు కేంద్రం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రులను ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
ఈ పథకం కింద ఒక్కో ప్రమాద బాధితుడికి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు నగదు రహిత వైద్యచికిత్స అందిస్తారు. ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్ఠంగా 7 రోజులపాటు ఈ ప్రయోజనం ఉంటుంది. ఈ పథకం కింద గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో బాధితులు నగదు రహిత చికిత్స పొందవచ్చు. ఇతర ఆస్పత్రుల్లోనూ అత్యవసర ప్రాథమిక చికిత్స అందిస్తారు. ఈ పథ కం కింద ఆస్పత్రుల ఎంపికలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతా లు, జాతీయ, రాష్ట్ర రహదారులకు ప్రాధాన్యం, ఆస్పత్రుల నమోదు, చికిత్స వివరాలు, క్లెయిమ్‌ల నిర్వహణకు డిజిటల్ వ్యవస్థ, నిబంధనలు ఉల్లంఘించే ఆస్పత్రులపై చర్యలు తదితర అంశాలపై ఎన్‌హెచ్‌ఏ (జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకం అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య, రవాణా విభాగాలకు వేర్వేరు బాధ్యతలు అప్పగించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి
ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ ఆదేశం
Read Latest Telangana News And Telugu News