Share News

వేసవి సెలవుల్లో కార్పొరేట్ కాలేజీల క్లాసులు.. పీడీఎస్‌యూ ధర్నా

ABN , Publish Date - Apr 06 , 2026 | 01:51 PM

వేసవి సెలవుల్లో కార్పొరేట్ కాలేజీలు క్లాసులు నిర్వహిస్తున్నాయంటూ నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు పీడీఎస్‌యూ ధర్నాకు దిగింది. విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా అడ్మిషన్లు కొనసాగిస్తున్న కాలేజీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.

వేసవి సెలవుల్లో కార్పొరేట్ కాలేజీల క్లాసులు.. పీడీఎస్‌యూ ధర్నా
PDSU Protest

హైదరాబాద్, ఏప్రిల్ 6: వేసవి సెలవుల్లో కార్పొరేట్ కాలేజీలు తరగతులు నిర్వహించడంపై పీడీఎస్‌యూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు అడ్మిషన్లు చేపట్టడంపై నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు విద్యార్థి సంఘం ధర్నా నిర్వహించింది. కార్పొరేట్ కాలేజీలు రిజల్ట్స్ రాకముందే అడ్మిషన్లు తీసుకుని, ఫీజు రాయితీ పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని పీడీఎస్‌యూ ఆరోపించింది. ఇలాంటి కాలేజీల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా అడ్మిషన్లు కొనసాగిస్తున్న కాలేజీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పీడీఎస్‌యూ ప్రభుత్వాన్ని కోరింది.


ప్రభుత్వం జారీ చేసిన జీఓలను పక్కన పెట్టి ప్రైవేట్ విద్యాసంస్థలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని పీడీఎస్‌యూ ఆవేదన వ్యక్తం చేసింది. వేసవి సెలవుల్లో కూడా క్లాసులు నిర్వహిస్తున్నాయని పేర్కొంది. ప్రభుత్వ విద్యాసంస్థలు మూతపడుతూ ఉండటం విద్యా వైషమ్యాలకు నాంది అవుతోందని పీడీఎస్‌యూ తెలిపింది. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందడం లేదని పేర్కొంది. నీట్, ఐఐటీ, జేఈఈ వంటి పోటీ పరీక్షల కోసం ప్రత్యేక అకాడమిక్ ప్లాన్ చేయాలని డిమాండ్ చేసింది. కార్పొరేట్ కాలేజీలకు మాత్రమే అవకాశాలు పెరుగుతుండటంపై ప్రభుత్వ వైఖరిని పీడీఎస్‌యూ విమర్శించింది. జూనియర్ కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించాలని పీడీఎస్‌యూ డిమాండ్ చేసింది.


ఇవి కూడా చదవండి...

సీఎం రేవంత్‌పై అసత్యాలు ప్రచారం.. బండి సంజయ్‌పై వీరేశం ఫైర్

కత్తితో భార్య గొంతులో పొడిచి హత్య చేసిన భర్త

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 06 , 2026 | 01:54 PM