Share News

పంజాగుట్ట గోల్డ్ చోరీ కేసు.. ప్రధాన నిందితుడు అతనే..

ABN , Publish Date - Feb 16 , 2026 | 04:32 PM

పంజాగుట్టలోని ఓ జ్యువెలరీ జరిగిన చోరీ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పంజాగుట్ట గోల్డ్ చోరీ కేసు.. ప్రధాన నిందితుడు అతనే..
Panjagutta Gold Theft

హైదరాబాద్, ఫిబ్రవరి 16: పంజాగుట్టలోని ప్రముఖ జ్యువెలరీ షోరూంలో జరిగిన బంగారం చోరీ కేసును పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో దుండగులు సుమారు ఒక కిలో బంగారం బిస్కెట్లను దొంగతనం చేశారు. ఈ షాపులో గత కొంతకాలంగా సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న గోపాలకృష్ణ అనే ఉద్యోగి ఈ చోరీలో ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. దుకాణంలో బంగారం బిస్కెట్లను రోజూ తన షూస్, సాక్స్‌లలో దాచుకుని తరలిస్తున్నట్లు గుర్తించారు.


దుకాణ యాజమానులు, సిబ్బందికి అనుమానం రావడంతో సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. గోపాలకృష్ణ బంగారం బిస్కెట్లను దొంగతనంగా తీసుకుపోతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా ఉంది. ఈ ఆధారాలతో పోలీసులు దర్యాప్తు చేపట్టి... ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు గోపాలకృష్ణతో పాటు మరికొందరు సహచరులు ఉన్నారని తెలుస్తోంది. చోరీకి గురైన దాదాపు ఒక కిలో బంగారం బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం విలువ రూ. కోటికిపైగా ఉంటుందని అంచనా. ఈ చోరీపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి..

గన్నవరంలో బిల్ గేట్స్‌కు ఘన స్వాగతం..

హెచ్‌సీయూలో ల్యాప్‌టాప్‌ల చోరీ కేసు.. ముగ్గురి అరెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 16 , 2026 | 04:57 PM