అండాల అక్రమ సేకరణతో సంబంధం లేదు
ABN , Publish Date - Nov 20 , 2026 | 01:24 AM
అక్రమంగా అండాల సేకరణ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఓ నిందితుడు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా తనను తర్వాత దశలో నిందితురాలిగా చేర్చారని పద్మజ ఫర్టిలిటీ కేంద్రం యజమాని డాక్టర్ పీ పద్మజ హైకోర్టుకు తెలిపారు.
ఓ నిందితుడి వ్యాఖ్యలతో నన్ను కేసులో చేర్చారు
దర్యాప్తునకు సహకరిస్తా.. ముందస్తు బెయిల్ ఇవ్వండి
హైకోర్టులో పద్మజ ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ పద్మజ పిటిషన్
హైదరాబాద్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): అక్రమంగా అండాల సేకరణ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఓ నిందితుడు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా తనను తర్వాత దశలో నిందితురాలిగా చేర్చారని పద్మజ ఫర్టిలిటీ కేంద్రం యజమాని డాక్టర్ పీ పద్మజ హైకోర్టుకు తెలిపారు. దర్యాప్తు సమయంలో ప్రాక్టీస్ నిలిపివేసి, అధికారులకు సహకరిస్తానని, తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ నర్సింగ్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. పద్మజ ఫర్టిలిటీ సెంటర్‌కు ప్రజల్లో ఎంతో విశ్వసనీయత ఉందని, చట్టం ఆమోదించిన కచ్చితమైన పద్ధతిలోనే ఫర్టిలిటీ సెంటర్‌ను నిర్వహిస్తున్నారని తెలిపారు. తప్పుడు ఆరోపణల ఆధారంగా పిటిషనర్‌ను కేసులో ఇరికించారన్నారు. ఫర్టిలిటీ సెంటర్‌కి వచ్చే తల్లిదండ్రులు, ఇతరులు ఇప్పటివరకు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని.. కేవలం పోలీసులు ఈ అంశాన్ని సంచలనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి...
సిరాజ్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. టీమిండియా ఎంపికపై గావస్కర్
హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం
Read latest Telangana News And Telugu NEws