Share News

పాడి కౌశిక్‌రెడ్డికి స్వర పరీక్షలకు అనుమతించిన హైకోర్టు

ABN , Publish Date - Nov 17 , 2026 | 06:40 AM

హుజురాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి హైకోర్టులో నిరాశ ఎదురయింది.

పాడి కౌశిక్‌రెడ్డికి స్వర పరీక్షలకు అనుమతించిన హైకోర్టు
Padi Kaushik Reddy

హుజురాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి హైకోర్టులో నిరాశ ఎదురయింది. ఓ కేసులో ఆయనకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ (ఎఫ్‌ఎస్ఎల్‌)లో వాయిస్‌ టెస్ట్‌ చేయించాలంటూ కరీంనగర్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు సోమవారం జస్టిస్‌ మధుసూదన్‌రావు ధర్మాసనం నిర్ణయాన్ని వెలువరించింది.. దీంతో కౌశిక్‌రెడ్డి స్వర పరీక్షకు సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.


వీణవంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సమ్మక్క- సారలమ్మ జాతర సందర్భంగా కౌశిక్‌రెడ్డి తన అనుచరులతో చట్టవిరుద్ధంగా గుమిగూడటంతోపాటు ఘర్షణలకు దిగినట్లు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణలో భాగంగా కౌశిక్‌రెడ్డి వాయిస్‌ టెస్ట్‌ చేయడానికి కరీంనగర్‌ కోర్టు దర్యాప్తు అధికారికి అనుమతి ఇచ్చింది. దానిని ఇప్పుడు అమలు చేయనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Updated Date - Nov 17 , 2026 | 06:40 AM