విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. ఒక్కొక్కరి వద్ద లక్షల్లో వసూలు
ABN , Publish Date - May 18 , 2026 | 03:43 PM
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉద్యోగాల పేరుతో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో ఉద్యోగాలంటూ నమ్మించి నిరుద్యోగుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసి కేటుగాళ్లు మోసానికి పాల్పడ్డారు.
హైదరాబాద్, మే 18: మియాపూర్‌లో ఉద్యోగాల పేరుతో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో ఉద్యోగాలంటూ నమ్మించి నిరుద్యోగుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్లు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట్‌లో అర్చన ప్రియ, సోమశేఖర్, రాజేంద్రప్రసాద్ కలిసి సీడీ దశరథ్ కన్సల్టెన్సీని నడిపారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుంచి సుమారు రూ.6 లక్షల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. ప్రస్తుతం.. ఆ కన్సల్టెన్సీ నిర్వాహకులు పరారీలో ఉన్నారు.
కన్సల్టెన్సీ మోసంతో 90 మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. కన్సల్టెన్సీ నిర్వాహకులు ఈజిప్ట్, ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను ఈజిప్ట్ వరకు తీసుకెళ్లారు. తీరా అక్కడకు వెళ్లాక ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో నిరుద్యోగులు సొంత ఖర్చులతో వెనుతిరిగారు. హఫీజ్‌పేట్‌లోని ఆఫీస్‌కు వెళ్లి చూడగా అది మూసేసి ఉండటంతో తాము మోసపోయినట్లు నిరుద్యోగులు గుర్తించారు. వెంటనే ఈ ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
గోవుల అక్రమ రవాణా.. డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ
Read Latest Telangana News And Telugu News