చంపేసి.. ఆపై అత్యాచారం
ABN , Publish Date - Sep 01 , 2026 | 05:22 AM
పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడలో 21 ఏళ్ల నర్సును, సమీపంలో ఉండే బైక్ మెకానిక్ దారుణంగా అంతమొందించి, ఆపై ఉన్మాదంతో లైంగిక దాడికి పాల్పడినట్లు తేలింది. శుక్రవారం రాత్రి జరిగిన నర్సు హత్యాచారం కేసు మిస్టరీని పోలీసులు ఛేధించారు.
వీడిన నర్సు హత్య కేసు మిస్టరీ
బిహార్ మెకానిక్ సనావుల్లానే హంతకుడు
ఒంటరిగా ఉందని రెక్కీ నిర్వహించి.. కిటికీలోంచి దూరి ఘాతుకం
తీవ్రంగా ప్రతిఘటించిన బాధితురాలు
ఆమె గొంతు నులిమి హత్య.. ఆపై
లైంగికదాడి.. నిందితుడి అరెస్ట్
స్వగ్రామంలో నర్సు అంత్యక్రియలు
పాడెమోసిన ఎమ్మెల్యే ఆదినారాయణ
రెక్కీ నిర్వహించి.. కిటికీలోంచి దూరి ఘాతుకం
తీవ్రంగా ప్రతిఘటించిన బాధితురాలు
గొంతు నులిమి హత్య.. ఆపై లైంగికదాడి
బిహార్‌కు చెందిన బైక్ మెకానిక్ సనావుల్లా అరెస్ట్
ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్, ఆగస్టు 31: పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడలో 21 ఏళ్ల నర్సును, సమీపంలో ఉండే బైక్ మెకానిక్ దారుణంగా అంతమొందించి, ఆపై ఉన్మాదంతో లైంగిక దాడికి పాల్పడినట్లు తేలింది. శుక్రవారం రాత్రి జరిగిన నర్సు హత్యాచారం కేసు మిస్టరీని పోలీసులు ఛేధించారు. నిందితుడు సనావుల్లా(34)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితునిపై అత్యాచారం, హత్యతో పాటు.. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సోమవారం శంషాబాద్ డీసీపీ రాజేష్ మీడియా కు వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన బాధితురాలు (21) ఉపాధి నిమిత్తం ఏడాది క్రితం మహేశ్వరం వచ్చారు. ఏడు నెలల క్రితం.. తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ హాస్పిటల్‌లో నర్సుగా చేరారు. సమీపంలోనే ఆసుపత్రికి చెందిన అద్దె క్వార్టర్స్‌లో ఉంటోంది. వీటికి సమీపంలోని శ్రీ భాగ్యలక్ష్మి బైక్ మెకానిక్ షాప్‌లో మెకానిక్‌గా పనిచేస్తూ, అక్కడే నివసించే సనావుల్లా కన్ను బాధితురాలిపై పడింది. నెలరోజులుగా ఆమె కదలికలను గమనిస్తూ వచ్చాడు. ఆమె ఉంటున్న గదిని ఫోన్‌లో ఫొటో కూడా తీసుకున్నాడు. ఈ క్రమంలో.. శుక్రవారం రాత్రి విధులు ముగించుకున్న బాధితురాలు తన విశ్రాంతి గదికి వెళ్లింది. అదే గదిలో ఆమెతో కలసి ఉంటున్న మరో నర్సు రాత్రి డ్యూటీకి వెళ్లింది. దీంతో ఒం టరిగా ఉన్న బాధితురాలు.. డోర్ లాక్ చేసుకొని రాత్రి 11 గంటల వరకు ఫోన్‌లో మాట్లాడిన అనంతరం, నిద్ర కు ఉపక్రమించింది. ఆ గదికి కిటీకీ (అల్యూమినియం) తలుపులు సరిగా లేకపోవడం గమనార్హం. కిటికీలోంచి ఇదంతా గమనించిన నిందితుడు.. అర్ధరాత్రి వరకు మద్యం సేవించి, అశ్లీల చిత్రాలు చూశాడు. అనంతరం మెల్లగా కిటికీలోంచి నర్సు గదిలోకి ప్రవేశించి, ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. మేలుకున్న బాధితురాలు కేకలు వేస్తూ అతన్ని తీవ్రంగా ప్రతిఘటించింది. ఆత్మరక్షణ కోసం గోర్లతో అతడి గొంతు, ఛాతీపై రక్కింది. నిందితుడి ఎడమచేతి చిటికెన వేలుని కూడా కొరికింది. దాంతో సైకోగా మారిన నిందితుడు ఆమె ముఖంపై దాడి చేసి, కిందకు తోసి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఉన్మాదంతో లైంగిక దాడికి పాల్పడ్డాడు. శనివారం మధ్యా హ్నం డ్యూటీ ముగించుకొని వచ్చిన మరో నర్సు.. గది తలుపు తట్టగా తీయక పోవడంతో ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని, గదిలో బాధితురాలు నిర్జీవంగా పడి ఉండడాన్ని గుర్తించారు. ఆమె ముఖం, కాళ్లకు, గాయాలు ఉన్నట్లు గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. మృతురాలి పిన్ని (చిన్నమ్మ) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
హంతకుడిని పట్టించిన ఫోన్ కాల్..
పోలీసులు తొలుత ఘటనాస్థలానికి సమీపంలోనే ఉం టున్న బైక్ మెకానిక్ సనావుల్లాను ప్రశ్నించారు. అయితే, అతడు తనకు ఏమీ తెలియదని చెప్పాడు. స్థానికులను విచారించగా, ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం కీలకంగా పనిచేసింది. అర్థరాత్రి వేళ సనావుల్లా తనకు ఫోన్ చేసి పెట్రోల్ కావాలని అడిగినట్లు ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో పోలీసులు సీసీటీవీ కెమెరాల రికార్డులను పరిశీలించారు. సనావుల్లా బైక్‌పై బయటకు వెళ్లి తిరిగి గదికి వచ్చినట్లు తెలిసింది. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడంతోపాటు, అతడి ఫోన్‌ను పరిశీలించారు. అతడి ఫోన్‌లో మృతురాలు గది ఫొటోతోపాటు అశ్లీల చిత్రాలను పోలీసులు గుర్తించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో.. నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. బిహార్‌లోని బెగూసరాయ్ జిల్లా, రుదౌలికి చెందిన నిందితుడు ఎండీ సనావుల్లా మూడేళ్ల క్రితం బతుకుదెరువుకోసం నగరానికి వచ్చాడు. అతడికి భార్య, కొడుకు ఉన్నారు. ప్రస్తుతం భార్య నిండు గర్భిణి కావడంతో డెలివరీ కోసం స్వస్థలానికి పంపాడు.
మృతురాలి అంత్యక్రియలు పూర్తి
మృతురాలి (21) అంత్యక్రియలు సోమవారం ఆమె స్వగ్రామమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామంలో పూర్తయ్యాయి. అశ్వారావు పేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణతోపాటు మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కన్నీటి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే ఆదినారాయణ.. స్వయంగా పాడే మోశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
కాంగ్రెస్, బీజేపీ.. ముట్ట‘ఢీ’!