Share News

నేడు ఢిల్లీకి రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Sep 01 , 2026 | 04:52 AM

ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ మావలంకర్‌ హాల్లో బుధవారం సాయంత్రం జరిగే వైఎస్ఆర్‌ అవార్డు ప్రదాన కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక విశిష్ట అతిథిగా హాజరు కానున్నారు.

నేడు ఢిల్లీకి రేవంత్‌రెడ్డి

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ మావలంకర్‌ హాల్లో బుధవారం సాయంత్రం జరిగే వైఎస్ఆర్‌ అవార్డు ప్రదాన కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక విశిష్ట అతిథిగా హాజరు కానున్నారు. మాజీ ఎంపీ కేవీపీ రాంచందర్‌రావు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, విశిష్ట అతిథిగా జైరాం రమేష్‌, గౌరవ అతిథులుగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహే్‌షగౌడ్‌, మంత్రి శ్రీధర్‌బాబు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం రేవంత్‌ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Sep 01 , 2026 | 04:54 AM