గనుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నర్సిరెడ్డి, లక్ష్మీనర్సింహరావు
ABN , Publish Date - Oct 06 , 2026 | 07:03 AM
గనులు, భూగర్భ వనరుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘానికి సోమవారం ఎన్నికలు జరిగాయి.
హైదరాబాద్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : గనులు, భూగర్భ వనరుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘానికి సోమవారం ఎన్నికలు జరిగాయి. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో గనుల శాఖ సంఘం అధ్యక్షుడిగా ఎం.నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కె.లక్ష్మీనర్సింహరావు, సహ అధ్యక్షుడిగా జి.సంజయ్‌కుమార్, ఉపాధ్యక్షులుగా ఆర్.రవీందర్, పి.శ్రీనివాస్, టి.రేణుక, సంయుక్త కార్యదర్శులుగా వెంకటేశ్వర్లు, కె.నాగరాజు, కోశాధికారిగా కె.లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కె.ప్రతా్‌పరెడ్డి, ఎన్.రమేశ్, జె.మధుసూదన్ ఎన్నికయ్యారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణలోని కీలక ప్రాజెక్టులకు సహకరించండి
ఎంబీబీఎస్ విద్యార్థులకు ‘ఫ్రీ ఎగ్జిట్’ అవకాశం
కాళేశ్వరం మరమ్మతులు త్వరగా చేపట్టండి
Read Latest Telangana News And Telugu News