Share News

చుక్కనీరు ఇంకదు.. రోడ్డు చెక్కుచెదరదు!

ABN , Publish Date - Nov 21 , 2026 | 06:37 AM

ఎంత ధృఢమైన బీటీ రోడ్డు అయినా వర్షపునీరు నిలిస్తే.. గుంతలు పడి, కంకర తేలి పాడవుతాయి! మరమ్మతులకు ఏటా కోట్లలో ఖర్చవుతోంది.

చుక్కనీరు ఇంకదు.. రోడ్డు చెక్కుచెదరదు!

  • బీటీ రోడ్ల నిర్మాణంలో నానో టెక్నాలజీ

  • రసాయనాలతో బీటీ మిశ్రమం పటిష్ఠం

  • తారు, కంకర మధ్య పెరుగనున్న ధృడత్వం

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఎంత ధృఢమైన బీటీ రోడ్డు అయినా వర్షపునీరు నిలిస్తే.. గుంతలు పడి, కంకర తేలి పాడవుతాయి! మరమ్మతులకు ఏటా కోట్లలో ఖర్చవుతోంది. ఐఆర్సీ ప్రమాణాల ప్రకారం నానో టెక్నాలజీతో బీటీ రోడ్డును నిర్మిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చునని, 20 ఏళ్ల వరకు రోడ్డు అత్యంత మన్నికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. యాంటీ- స్ట్రిప్‌ విధానంలో పనిచేసే రసాయనాలు బీటీ రోడ్ల నిర్మాణంలో కీలకంగా మారనున్నాయి. తారు, కంకర మధ్య దృడత్వం పెంచేలా ఈ రసాయనాలు ఉపయోగపడుతాయి. టన్ను బీటీ మిశ్రమంలో 300 గ్రాముల నుంచి వెయ్యి గ్రాముల వరకు రసాయనాలు కలపాల్సి ఉంటుంది. తారు బరువును బట్టి రసాయనాలు ఎంత మోతాదులో కలపాలన్నది నిర్ణయిస్తారు.


రసాయనాలు కలిపి నిర్మించడం వల్ల వర్షపు నీరు లోపలికి చేరదు. ఒకవేళ రోడ్డుపై నిలిచినా లోపలికి వెళ్లదని, దీంతో రోడ్డు పాడయ్యే అవకాశం ఉండదని ఐఆర్‌సీ సదస్సులో స్టాల్‌ ఏర్పాటు చేసిన జైడెక్స్‌ కంపెనీ ప్రతినిధి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నానో ఆక్రిలిక్‌ బైండర్‌తో టెర్రాసిల్‌ కలిపి వాడటం వల్ల మట్టి రోడ్లనూ వాటర్‌ ప్రూఫ్‌గా మార్చవచ్చునని చెప్పారు. రసాయనాలను నేరుగా కంకరలో కాకుండా వేడిగా ఉన్న తారు (బీటీ)ను ట్యాంక్‌లో పోసి రసాయనాలు కలపాలని చెప్పారు. ఈ సమయంలో తారు ఉష్ణోగ్రత 130 నుంచి 160 డిగ్రీల సెంటిగ్రేడ్‌గా ఉండాలని వివరించారు. క్యూర్‌ పరిధిలో 12 వేల కి.మీకి పైగా రహదారులు ఉన్నాయి. వీటిలో 60 శాతం వరకు బీటీ రోడ్లే. వీటి మరమ్మతుల కోసం యేటా సుమారు రూ.1000 కోట్ల వరకు ఖర్చవుతోంది. రోడ్ల నిర్మాణంలో నిపుణులు సూచించిన టెక్నాలజీ వాడితే ఈ ఖర్చంతా మిగులుతుంది.


ఇవి కూడా చదవండి...

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు

కాంగ్రెస్ మంత్రులకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రిక్వెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 06:37 AM