జ్యువెల్లరీ షాపులో చోరీకి యత్నం.. అర్ధరాత్రి వేళ గోడ బద్దలు కొట్టి..
ABN , Publish Date - Nov 22 , 2026 | 07:42 PM
హైదరాబాద్‌లోని నాగోల్‌లో దొంగలు రెచ్చిపోయారు. ఓ జ్యువెల్లరీ షాపులో చోరీకి విఫలయత్నం చేశారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్‌నగర్ ఎక్స్ రోడ్డులో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్: నాగోల్‌లో దొంగలు రెచ్చిపోయారు. ఓ జ్యువెల్లరీ షాపులో చోరీకి విఫలయత్నం చేశారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్‌నగర్ ఎక్స్ రోడ్డులో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆశాపుర పాన్ బ్రోకర్ అండ్ జ్యువెల్లర్స్ దుకాణంలో చోరీకి దొంగలు ప్రయత్నించారు. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ దుకాణం వెనుక గోడకు రంధ్రం చేశారు. అనంతరం లోపలికి ప్రవేశించారు. అయితే, ఎలాంటి వస్తువులు అపహరణకు గురికాకపోవడంతో భారీ నష్టం తప్పింది. చోరీ యత్నానికి సంబంధించిన దృశ్యాలు షాపులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో షాపు యజమాని పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎల్‌బీనగర్ ఏసీపీ రవీందర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు, క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపారు. ఈ నేపథ్యంలో నిందితులకు సంబంధించిన నాలుగు వేలిముద్రలను సేకరించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ధరణి కృష్ణ జాబ్ ఫ్రాడ్ కేసు.. హైదరాబాద్‌లో సీఐడీ సోదాలు
లష్కరే తోయిబా పేరుతో ఫేక్ మెయిల్.. హైదరాబాద్‌లో పోలీసుల అలర్ట్