ఇంకా ఇద్దరి పరిస్థితి విషమం
ABN , Publish Date - Oct 19 , 2026 | 06:35 AM
నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం నిర్వహించిన దాండియా వేడుకల్లో గాయపడిన వారిలో ఇంకా ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉంది.
ఎంవీఎస్ఆర్ కళాశాల ‘దాండియా’ ప్రమాద ఘటన
ఓల్డ్‌మలక్‌పేట, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం నిర్వహించిన దాండియా వేడుకల్లో గాయపడిన వారిలో ఇంకా ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉంది. ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన లైటింగ్ సిస్టమ్ కూలడంతో సోనా(18) అనే విద్యార్థిని మరణించింది. మరో తొమ్మిది మందికి హైదరాబాద్, ఓల్డ్ మల్క్‌పేట్ ప్రాంతంలో యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందులో అక్షర రెడ్డి, శ్రావ్య అనే విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉంది.
అక్షర రెడ్డి మెడ, ఊపిరితిత్తులకు, కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. శ్రావ్యకు వెన్నెముక, తల, ఊపిరితిత్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరికీ ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. మిగిలిన ఏడుగురిలో నలుగురిని ఆదివారం డిశ్చార్జి చేశారు. మరో ముగ్గురిని సోమవారం డిశ్చార్జి చేసే అవకాశముంది. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కె.కళ్యాణ్ చక్రవర్తి ఆదివారం ఉదయం పరామర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి
మూడోవంతు విద్యుత్ జెన్‌కో నుంచే...
క్యూనెట్ కేసు కీలక నిందితుడు డిగ్ విజయ్‌సింగ్ అరెస్టు
Read Latest AP News And Telangana News And International