Share News

కాలేజ్‌లో ఈవెంట్ పెట్టి నా కూతురిని చంపేశారు.. మృతురాలు సోనా తండ్రి ఆవేదన

ABN , Publish Date - Oct 18 , 2026 | 01:00 PM

నాదర్గుల్‌లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ప్రమాదంలో తన కూతురు ప్రాణాలు కోల్పోవడంతో నారాయణదాసు సోనా (18) తండ్రి కన్నీరుమున్నీరు అవుతున్నారు.

కాలేజ్‌లో ఈవెంట్ పెట్టి నా కూతురిని చంపేశారు.. మృతురాలు సోనా తండ్రి ఆవేదన
Meena, Sona

ఇంటర్నెట్ డెస్క్: నాదర్గుల్‌లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ప్రమాదంలో తన కూతురు ప్రాణాలు కోల్పోవడంతో నారాయణదాసు సోనా (18) తండ్రి కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాలేజ్‌లో ఈవెంట్ పెట్టి తన కూతురిని చంపేశారని ఆవేదన చెందుతున్నారు. ‘ఇవాళ నా ఇద్దరు పిల్లల్ని ఊరు తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ నా కూతురి శవాన్ని తీసుకువెళ్తున్నాను. పండగకు ఇంటికి వస్తుందనుకున్న నా పెద్ద కూతురు చనిపోయింది, చిన్న కూతురి పరిస్థితి విషమంగా ఉంది’ అంటూ ఆయన కంటతడి పెట్టుకున్నారు.


కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన కూతుళ్ల భవిష్యత్తు నాశనమైందని సోనా తండ్రి వాపోయారు. అంత పెద్ద ఈవెంట్ పెట్టి ఏర్పాట్లు సరిగా చేయలేదని ఆరోపించారు. సోనా చనిపోతే ఇంతవరకు కాలేజ్ యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. నెల రోజుల క్రితమే ఇద్దరు ఈ కాలేజీలో జాయిన్ అయ్యారని ఈలోపు ఇలా జరిగిందని గుండెలవిసేలా రోదించారు. చిన్నమ్మాయికి వేరే కాలేజీలో సీటు వచ్చినా ఇద్దరు కలిసి ఉంటారని ఇక్కడ చేర్పించామని ఆయన చెప్పారు.


కాగా.. హైదరాబాద్ శివారులోని నాదర్‌గుల్ ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం నిర్వహించిన డాండియా వేడుకల్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ దీపాలతో అలంకరించిన భారీ ఆర్చ్ ఒక్కసారిగా కూలిపోవడంతో ప్రథమ సంవత్సరం బీటెక్ విద్యార్థిని నారాయణదాసు సోనా మృతి చెందగా.. మరో 14 మంది విద్యార్థులు గాయపడ్డారు. మృతురాలి సోదరి మీనాకూ ఈ ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి.


ఈ వార్తలూ చదవండి

వినోదంలో పెను విషాదం.. ఇంజనీరింగ్‌ కాలేజీ ఉత్సవంలో ప్రమాదం

ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన.. బాధితులకు సీఎం రేవంత్ భరోసా

Updated Date - Oct 18 , 2026 | 01:04 PM