Share News

బెజవాడలో ఎమ్మెల్యే వర్సెస్‌ ఎంపీ

ABN , Publish Date - Oct 18 , 2026 | 04:43 AM

విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో సీట్ల కేటాయింపు అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే నడుమ చిచ్చు రగిల్చింది. విజయవాడ మేయర్‌ స్థానాన్ని జనసేనకు కేటాయించారు.

బెజవాడలో ఎమ్మెల్యే వర్సెస్‌ ఎంపీ

అధికార పార్టీలో సీట్ల సర్దుబాటు చిచ్చు

అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో సీట్ల కేటాయింపు అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే నడుమ చిచ్చు రగిల్చింది. విజయవాడ మేయర్‌ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. కార్పొరేటర్ల స్థానాల్లో ఏ పార్టీ అభ్యర్థులు ఎంత మంది పోటీ చేయాలనే దానిపై రెండు రోజులుగా కూటమి పార్టీల నడుమ చర్చలు నడుస్తున్నాయి. అందులో భాగంగా శనివారం విజయవాడలోని ఓ హోటల్‌లో టీడీపీ, జనసేన నేతలు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమ నడుమ సీట్ల సర్దుబాటుపై మొదలైన చర్చ ఇద్దరి నడుమ వాగ్వాదానికి దారి తీసింది. తన నియోజకవర్గం నుంచే ఎక్కువ సీట్లను కూటమి పార్టీలకు కేటాయుస్తున్నారంటూ బొండా ఉమ ప్రశ్నించడంతో వాగ్వాదం మొదలైంది. చివరికి తీవ్రస్థాయికి చేరింది. ఇద్దరూ అరుచుకుంటూ నిష్క్రమించారు. దీంతో సర్దుబాటుపై నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది.

ఈ వార్తలనూ చదవండి:

జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు

దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ

Updated Date - Oct 18 , 2026 | 04:45 AM