Share News

ముద్ఖేడ్‌-డోన్‌ రైల్వే డబ్లింగ్‌కు లైన్‌ క్లియర్‌

ABN , Publish Date - Nov 25 , 2026 | 06:00 AM

ముద్ఖేడ్‌-డోన్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులకు కీలక ముందడుగు పడింది.

ముద్ఖేడ్‌-డోన్‌ రైల్వే డబ్లింగ్‌కు లైన్‌ క్లియర్‌

  • ఇందల్వాయిలో 34 ఎకరాల భూసేకరణకు తుది గెజిట్‌ విడుదల

న్యూఢిల్లీ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ముద్ఖేడ్‌-డోన్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులకు కీలక ముందడుగు పడింది. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలంలోని నాలుగు గ్రామాల్లో ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియకు కేంద్ర రైల్వే శాఖ తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో భూముల స్వాధీనానికి మార్గం సుగమమైంది. త్వరలోనే రైతులకు నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించి పనులు ప్రారంభించనున్నారు.


రైల్వే చట్టం-1989లోని సెక్షన్‌ 20(ఏ) కింద ఈ ఏడాది సెప్టెంబరు 12న ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసిన అధికారులు.. అదే నెల 19, 20 తేదీల్లో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. భూసేకరణపై ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో పాటు, సబంధిత అధికారి నివేదిక సమర్పించడంతో సెక్షన్‌ 20(ఈ) కింద తుది నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దీని ప్రకారం ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లిలో 22.3225 ఎకరాలు, సిర్నాపల్లిలో 8.1500, గన్నారంలో 3.1050, ఇందల్వాయిలో 1.0100 ఎకరాల చొప్పున మొత్తం 34.5875 ఎకరాలను సేకరించనున్నారు. పట్టా, ప్రభుత్వ, ఇతర వర్గాలకు చెందిన భూములను గుర్తించి ఇప్పటికే గెజిట్‌లో పొందుపరిచారు.


ఈ వార్తలు కూడా చదవండి

మారిషస్‌‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..

సంజయ్ గాంధీని దొంగ అన్నాడని చెంపదెబ్బ కొట్టా: ప్రియాంక గాంధీ

Updated Date - Nov 25 , 2026 | 06:00 AM