Share News

ఏసీబీ వలలో మొయినాబాద్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారి

ABN , Publish Date - Oct 01 , 2026 | 06:23 AM

మొయినాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో ఓ అక్రమ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండటం కోసం పెద్ద ఎత్తున లంచం డిమాండ్‌ చేసి డబ్బు తీసుకున్న టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, సీనియర్‌ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు.

ఏసీబీ వలలో మొయినాబాద్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారి
Moinabad ACB trap

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మొయినాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో ఓ అక్రమ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండటం కోసం పెద్ద ఎత్తున లంచం డిమాండ్‌ చేసి డబ్బు తీసుకున్న టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, సీనియర్‌ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారి గుండు వాణి వద్ద సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ మాజీ కార్యదర్శి సుదర్శన్‌.. ఆమె తరఫున బాధితుడి వద్ద నుంచి రూ.75 వేలు లంచం తీసుకుని, ఆ డబ్బును ఆమెకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.


ఈ మేరకు బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ నేతృత్వంలోని హైదరాబాద్‌ సిటీ రేంజ్‌ బృందం వల పన్ని అవినీతికి పాల్పడిన అధికారులను రెడ్‌హ్యండెండ్‌గా పట్టుకుందని ఏసీబీ డైరక్టర్‌ జనరల్‌ చారుసిన్హా ఓ ప్రకటనలో తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

క్షుద్ర పూజలంటూ అపవాదు వేశారు

బీఎల్‌వోలు ఓటర్ల ఇంటికే వెళ్లండి..!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 06:23 AM