అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:28 PM
ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు.
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గత 12 ఏళ్లలో మోదీ తన పాలనలో ప్రత్యేకమైన ముద్ర వేసారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశ అభివృద్ధితో పాటు సామాజిక సంక్షేమానికి కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. అవినీతికి కాంగ్రెస్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఆరోపించారు. బొగ్గు రంగంపై మాట్లాడుతూ.. కోల్ సెక్టార్‌లో అవినీతి, అక్రమాలకు ఎలాంటి అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం బొగ్గు వినియోగంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని, దేశ పారిశ్రామికాభివృద్ధిలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోందని కిషన్‌రెడ్డి వివరించారు.
Also Read:
ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం గ్రామాన్ని అభివృద్ధి చేస్తా: మంత్రి తుమ్మల
పద్ధతి దాటి మాట్లాడితే.. మేమూ మాట్లాడాల్సి వస్తుంది: డీకే అరుణ