ఎమ్మెల్సీ బల్మూరి దంపతులకు తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Nov 19 , 2026 | 05:31 AM
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ దంపతులు ప్రయాణిస్తున్న కారును డీసీఎం ఢీ కొట్టింది. ఘటన కొత్తూర్ బైపాస్ రోడ్డు వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగింది.
కొత్తూర్ వద్ద ఎమ్మెల్సీ కారును ఢీ కొట్టిన డీసీఎం
కొత్తూర్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ దంపతులు ప్రయాణిస్తున్న కారును డీసీఎం ఢీ కొట్టింది. ఘటన కొత్తూర్ బైపాస్ రోడ్డు వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగింది. భార్య ఇందూజ, తమ్ముడు చాణక్య, కారు డ్రైవర్ నవీన్‌రెడ్డితో కలిసి ఆయన ఇన్నోవా కారులో తిరుమల నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కొత్తూర్ బైపాస్ రోడ్డులోని జేపీ దర్గా చౌరాస్తాకు రాగానే, వారు ప్రయాణిస్తున్న కారును కోళ్ల లోడ్ తీసుకువెళ్తున్న డీసీఎం ఢీ కొట్టింది.
ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా, ముందు సీట్లలో ఉన్న చాణక్య, నవీన్‌రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్సీ వెంకట్ దంపతులు వెనుక సీటులో కూర్చొవడంతో వారికి ఎలాంటి గాయాలు కాలేదు. గన్‌మెన్లు మరో వాహనంలో ఘటనా స్థలానికి చేరుకోగా ఎమ్మెల్సీ వారితో కలిసి కొత్తూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ప్రమాదం గురించి వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తూర్ ఇన్‌స్పెక్టర్ నాగార్జునరెడ్డి తెలిపారు. అనంతరం బల్మూరి కుటుంబ సభ్యులు మరో వాహనంలో హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి
ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ ఆదేశం
Read Latest Telangana News And Telugu News