Share News

హైదరాబాద్‌లో దారుణం.. భర్తను చంపి పూడ్చిపెట్టిన భార్య

ABN , Publish Date - Jul 07 , 2026 | 03:32 PM

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య అత్యంత కిరాతంగా హత్య చేసింది.

హైదరాబాద్‌లో దారుణం.. భర్తను చంపి పూడ్చిపెట్టిన భార్య
Hyderabad News

హైదరాబాద్, జులై 7: నగరంలోని మియాపూర్‌లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య అత్యంత కిరాతంగా హత్య చేసింది. ఆ తరువాత భర్త కనిపించడం లేదంటూ గతేడాది నవంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన మియాపూర్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా అసలు నిజాలు బయటకు వచ్చాయి. ఏడు నెలల తర్వాత ఈ కేసులో భార్యే హంతకురాలిగా పోలీసులు తేల్చారు. భర్తను భార్యే హత్య చేసి ఆపై కనిపించడం లేదంటూ నాటకం ఆడినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా భార్య కాల్ రికార్డ్స్‌ను, సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.


భర్తను చంపి మృతదేహాన్ని మహారాష్ట్ర బోర్డర్ వరకు తరలించి పూడ్చిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక పోలీసుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు పెంటేష్‌(45)గా గుర్తించారు. తన ప్రేమ వ్యవహారానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో వెంకటేష్‌ను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో భార్య అంగీకరించింది. ప్రస్తుతం నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ప్రియుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను భార్య హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


ఇవి కూడా చదవండి...

కొండా సురేఖ-కడియం శ్రీహరి మధ్య ముదురుతున్న వివాదం

బీఎల్‌వోలను ఎంఐఎం, కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు: రాంచందర్‌రావు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 05:08 PM